రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పిఎం సూర్య ఘర్ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

పిఎం సూర్య ఘర్ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి

  • రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ మీద జీఎస్టీ 18 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు గురించి అవగాహన కల్పించండి
  • ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ లు..ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
  • జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి


కర్నూలు, డిసెంబర్ 04 (పీపుల్స్ మోటివేషన్):-

పిఎమ్ సూర్య ఘర్ పథకంలో భాగంగా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ మీద జీఎస్టీ 18 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు..

గురువారం కలెక్టర్ ఛాంబర్ లో పీఎం సూర్య ఘర్ కి సంబంధించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంను కలెక్టర్ నిర్వహించారు.. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిఎం సూర్య ఘర్ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ జిల్లా స్థాయి కమిటీ సభ్యులను ఆదేశించారు.. ఈ పథకం కింద 2026-2027 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశం అంతటా 1 కోటి గృహాలకు పైకప్పు సౌర వ్యవస్థలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగ జిల్లాలో లక్ష గృహాలకు పైకప్పు సౌర వ్యవస్థలను ఏర్పాటు చేసే విధంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈవో, డిఆర్డిఏ, మెప్మా పిడి లను, డిపిఓ లను ఆదేశించారు... 

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ లు ఇస్తోందని, ఈ అంశంపై శ్రద్ధ వహించి సోలార్ ప్యానెల్ లను ఇన్స్టాల్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

రూ.70 వేల విలువ చేసే 1 కిలో వాట్ సోలార్ ప్యానెల్ కొని ఇన్స్టాల్ చేసుకుంటే రూ.30 వేలు సబ్సిడీ వస్తుందని, రూ.1.40 లక్షల విలువ చేసే 2 కిలో వాట్స్ సోలార్ ప్యానెల్ కొని ఇన్స్టాల్ చేసుకుంటే, రూ.60 వేలు సబ్సిడీ వస్తుందని,రూ. 2.10 లక్షలవిలువ చేసే 3 కిలో వాట్స్ సోలార్ ప్యానెల్ కొని ఇన్స్టాల్ చేసుకుంటే, రూ.78 వేలు సబ్సిడీ వస్తుందన్నారు.. అదే విధంగా వీటి పైన జీఎస్టీ కూడా 18 శాతం నుండి 5 శాతం వచ్చినందుకు యూనిట్ కాస్ట్ మరింత తక్కువకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.. ఈ అంశం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో పీఎం సూర్య ఘర్‌ పథకం కింద ఇప్పటివరకు 92 వేల 469 మంది రిజిస్టర్ అయ్యారని, ఎస్సీ, ఎస్టీ కింద 81 వేల 591 మంది ఇతరులు 10 వేల 878 మంది రిజిస్టర్ అయ్యారన్నారు... ఇందులో ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించిన 23 వేల 77 మంది గృహాలకు రూఫ్ టాప్ సోలార్ లను మార్చి నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ వివరించారు.

అలాగే మోడల్ సోలార్ గ్రామాల కింద నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు... అందులో భాగంగా 6 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయడం జరిగిందన్నారు.. అందులో పెద్దహరివాణం గ్రామంలో ఎక్కువ సంఖ్యలో 5 రూఫ్ టాప్ సోలార్ లను ఏర్పాటు చేసినందుకు గాను సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద అంగన్వాడి సెంటర్లలో, వైద్యశాలల్లో, పాఠశాలల్లో సోలార్ స్ట్రీట్ లైట్ లు, త్రాగు నీటి ఏర్పాటు కొరకు కోటి రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని ఎస్ ఈ కలెక్టర్ కు వివరించారు. 

సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ప్రదీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, ఎల్ డి ఎం రామచంద్ర రావు, డి ఆర్ డి ఏ పిడి రమణా రెడ్డి, మెప్మా పిడి శ్రీనివాసులు, నెడ్ క్యాప్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-