నేటి నుండి నగరంలో హస్తాకళల ఉత్పత్తులు మరియు అమ్మకాలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
నేటి నుండి నగరంలో హస్తాకళల ఉత్పత్తులు మరియు అమ్మకాలు
- దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా ఉత్పత్తులు ఒకే వేదికపై ప్రదర్శన
- ఉత్పత్తి దారులచే నేరుగా అమ్మకాలు
- అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రైనింగ్స్) మోకా సత్తి బాబు
- హస్తకళలను ప్రోత్సహించి కళాకారులను ఆదరించి వారికి ఆర్థిక తోడ్పాటును అందించాలని అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రైనింగ్స్) మోకా సత్తి బాబు తెలిపారు.
స్థానిక ఆటోనగర్ బస్టాంట్ ఎదురుగా గల సాయి బాబా కళ్యాణ మండపంలో ఎపిట్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హస్తకళా ఉత్పత్తుల థీమాటిక్ ఎగ్జిబిషన్ ను గురువారం అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రైనింగ్స్) మోకా సత్తి బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళా ఉత్పత్తులను ఆదరించి ఆ కళాకారులకు ఆర్థిక చేయూతని అందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా హస్త కళా కారులచే తయారైన ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి అమ్మకాలు నిర్వహించేలా నేటి నుండి 12 వ తేదీ వరకు పది రోజుల పాటు నగరంలో హస్తకళా ఉత్పత్తుల థీమాటిక్ ఎగ్జిబిషన్ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాచీన హస్త కళలు భారతీయ సాంస్కృతి సాంప్రదాయలు ఉట్టిపడే విధంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు వారి కళా నైపుణ్యంతో రూపొందించిన హస్త కళా ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి సుమారు 50 స్టాల్స్ ద్వారా ప్రదర్శన అమ్మకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నగర ప్రజలు ఎగ్జిబిషన్ ను ఆదరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు..
డవలప్ మెంట్ కమిషనర్ హ్యాండీ క్రాఫ్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్. అపర్ణ లక్ష్మి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ హ్యాండీ క్రాప్స్ డెవలప్‌మెంట్ కమిషన్ సహకారంతో నిర్వహించే థీమాటిక్ ఎగ్జిబిషన్ లో కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, రాజస్థాన్, మహారాష్ట్ర, బిహార్, ఒరిస్సా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, గుజిరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పేరుగాంచిన కొండపల్లి, ఏటికొప్పాక, హస్త కళా ఉత్పత్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేసి అమ్మకాలు నిర్వహిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎకౌంట్స్ ఎన్. ప్రియాంక, ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ. శేఖర్, ఎపిట్కో సంస్థ ప్రతినిధులు డి. సుధీర్ కుమార్ లు పాల్గొన్నారు.
Comments
