న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు డి.ఏ పెంపు
- పదవీ విరమణ చేసిన వారికి కూడా డి.ఏ పెంపు
- 55%నుండి 58%కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయ శాఖ
- రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి
అమరావతి డిసెంబరు: 4 కేంద్ర న్యాయశాఖ లేఖలను అనుసరించి హైకోర్టు న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు, న్యాయాధికారులకు, కుటుంబ పింఛనర్లకు డి.ఏ ను 55% నుండి 58% కు పెంచుతూ రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెంపు 01-07-2025 నుండి అమల్లోకి వస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.
Comments
