స్కేటర్లకు రాష్ట్ర క్రీడాశాఖ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మంత్రి అభినందనలు
స్కేటర్లకు రాష్ట్ర క్రీడాశాఖ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మంత్రి అభినందనలు
జాతీయ రోలర్ స్కేటింగ్‌లో విజయవాడ క్రీడాకారులకు పతకాలు పంట
విశాఖ వేదికగా ఈ నెల 5 నుంచి 15 వరకు నిర్వహించిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో విజయవాడకు చెందిన అంచిత, దినేష్, దిరాజ్, తనుజ, తన్మయి పతకం సాధించడం అభినందనీయమని, క్రీడాకారులకు మంచి శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన కోచ్ లు మహమ్మద్ ఖాజా, నాగుల్ మీరను ప్రత్యేకంగా ప్రశంసించారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొనియాడారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో వీరిని అభినందించారు.
రోలర్ స్కేటింగ్ అండర్ 18, 15, 12 విభాగంలో 1 బంగారు, 4 కాంస్య, 5 రజతం పతకాలు సాధించడం ప్రశంసనీయం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేలా ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోచ్ లు మహమ్మద్ ఖాజా టీమ్, టీమ్ నాగుల్ మీర , పలువురు కోచులు ఉన్నారు.
