గ్రామీణ నిరుపేద ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం
గ్రామీణ నిరుపేద ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం
319 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 5జి సెల్ ఫోన్లు పంపిణీ
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ...
ఏలూరు/నూజివీడు, డిసెంబరు 19: నూజివీడు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలోని 319 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ మొబైల్స్ అందజేసి, గ్రామీణ నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు ప్రజలు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం చెయ్యాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సేవలు వేగవంతం, పారదర్శకత కోసం స్మార్ట్ టెక్నాలజీని అంగన్వాడీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అంగన్వాడీ సిబ్బంది వేతనాలు పెంపు జరిగిందని చెప్పారు. గతంతో పోలిస్తే అంగన్వాడీ కార్యకర్తలు గౌరవం, ఆర్థిక భద్రత, భరోసా పెరిగిందన్నారు. రాష్ట్రంలో 5 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాల స్థాయికి అప్‌గ్రేడ్ చేసిన కూటమి ప్రభుత్వం మని అన్నారు. దీన్ని వలన పోస్టులు సంఖ్య పెరిగి, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, భవనాలు, త్రాగునీరు, మరుగుదొడ్లు మెరుగు పర్చడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై పని భారం తగ్గించేందుకు యాప్‌ల సంఖ్యను తగ్గించాలనే ప్రతిపాదనతో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. పిల్లలు పోషణ, తల్లుల ఆరోగ్య పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరిగేందుకు డిజిటల్ వ్యవస్థ తీసుకొచ్చామని అన్నారు. అంగన్వాడీలు ప్రభుత్వానికి కీలక భుజాలని, వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమర్థతగల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీరికి తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో చిన్నబిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దు తున్నామన్నారు.అంగన్వాడీ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినను మీకు అండగా ఉంటానని, మంచి సేవలు అందించి మంచి ఫలితాలను తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. టీచర్లు, వర్కర్లకు, అంగన్వాడీ సిబ్బందికి రిటైర్ అనంతరం గ్రాడ్యుట్ సుమారు రూ1లక్ష అందజేస్తున్న కూటమి ప్రభుత్వం అన్నారు. మునుపెన్నడూ లేని విదంగా అంగన్వాడీ వర్కర్లు గాని టీచర్లు గాని చనిపోతే మట్టి ఖర్చులు రూ 15 వేలు అందిస్తున్న కూటమి ప్రభుత్వామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అంగన్వాడి టీచర్లు, కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
