రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

విద్యా - వైద్య స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలవాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

విద్యా - వైద్య స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలవాలి

  • విద్యా - వైద్య స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలవాలి  
  • స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ సంకల్పానికి అనుగుణంగా విద్యా - వైద్య రంగంలో గుంటూరు జిల్లా ఫలితాలు
  • జాతీయ ఆరోగ్య మిష‌న్ కార్య‌క్ర‌మాల‌పైనా ప్ర‌త్యేక దృష్టి పెట్టాలి
  • ఆయుష్మాన్ భార‌త్‌ - డా. ఎన్‌టీఆర్ వైద్య సేవ‌తో ఆరోగ్య గుంటూరు  
  • గుంటూరు జిల్లా మానవ వనరుల అభివృద్ధితో స్వర్ణాంధ్రకు బాటలు 
  • తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాలతో డ్రాప్ అవుట్స్ కు చెక్ 
  • పీఎం శ్రీ - మన బడి మన భవిష్యత్ తో పాఠశాలలో నాణ్యమైన మౌలిక సదుపాయాలు 
  • పీటీఎం ద్వారా విద్యార్థులు, తల్లితండ్రులు మరియు అధ్యాపకుల సమావేశంతో పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనం మరియు మౌలిక సదుపాయాల కల్పనకు అద్భుతమైన సలహాలు 
  • జిల్లా భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు అనుగుణంగా సురక్షిత తాగునీరు అందించే విధంగా జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌, అమృత్ ప్ర‌ణాళిక‌లు
  • ఇరవై సూత్రాల కార్య‌క్ర‌మల అమలు ( స్వర్ణాంధ్ర - వికాసిత్ భారత్) ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్‌


గుంటూరు, డిసెంబర్ 4 :
విద్యా - వైద్య స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలవాలని ఇరవై సూత్రాల కార్య‌క్ర‌మల అమలు ( స్వర్ణాంధ్ర - వికాసిత్ భారత్) ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్‌ అన్నారు. గురువారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఇరవై సూత్రాల కార్య‌క్ర‌మల అమలు ( స్వర్ణాంధ్ర - వికాసిత్ భారత్) ఛైర్మ‌న్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా క‌లెక్ట‌ర్ తమీమ్ అన్సారీయా, నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవతో క‌లిసి వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, మౌళిక సదుపాయాల కల్పన శాఖలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప‌థ‌కాల స్ఫూర్తిని పూర్తి స్థాయిలో అర్థంచేసుకుంటూ అభివృద్ధి దిశ‌గా అడుగులు వేయ‌డం ప్ర‌ధాన‌మ‌ని.. ఈ నేప‌థ్యంలో స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప్ర‌తి కార్య‌క్ర‌మం అమ‌లుకావాల‌ని అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. వైద్య ఆరోగ్యం మరియు విద్యాకు సంబందించిన పథకాలు , అమృత్ 1.0, అమృత్ 2.0, జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌, పీఎం సూర్య‌ఘ‌ర్‌, పీఎం కుసుమ్‌ల‌పై ఆయా శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. 

పీఎం మాతృవందన యోజన, జ‌న‌నీ సుర‌క్షా యోజ‌న (జేఎస్‌వై), జ‌న‌నీ శిశు సంర‌క్ష కార్య‌క్ర‌మం, రాష్ట్రీయ కిషోర్ స్వస్త కార్యక్రమం (ఆర్కెఎస్కె), రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ( ఆర్బీఎస్కె), ఆయుష్మాన్ భార‌త్ - ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న, ఎన్టీఆర్ వైద్య సేవ, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ భోజన పథకం, పీఎం శ్రీ త‌దిత‌ర ప‌థ‌కాల‌తో పాటు గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత తాగునీటిని అందించే జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌, అమృత్ ప‌థ‌కాల‌కు సంబంధించిన అంశాల‌పై స‌మీక్షించి, పురోగ‌తికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌పై సూచ‌న‌లు చేశారు. బ‌హుళ ప్ర‌యోజ‌నాల పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం అమ‌ల్లోనూ మ‌రింత చొర‌వ చూపాల‌న్నారు. 

స‌మీక్షా స‌మావేశం అనంత‌రం లంకా దిన‌క‌ర్ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ …

వైద్య రంగం: 

జిల్లాలో డాక్టర్ కేర్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ లో 65,215 రిజిస్ట్రేషన్లు అయితే అందులో 91% ఆయుష్మాన్ భరత్ హెల్త్ అకౌంట్ క్రింద నమోదు అవ్వగా, నర్సుల ద్వారా 78% ఇన్స్పెక్షన్ మరియు మెడికల్ ఆఫీసర్ ద్వారా 77% డయాగ్నసిస్ చేయబడ్డాయి.

జిల్లాలో 18,634 ల్యాబ్ టెస్టులు చేస్తే అదే రోజున 18,564 టెస్టులు ఫలితాలు మరియు 46,332 మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే అదే రోజున 45,499 ప్రిస్క్రిప్షన్లకు మందులు జారీ చేయబడ్డాయి. 

జిల్లాలో 19 నుండి 45 సంవత్సరాల వయస్సు వారికి 2025 - 26 సంవత్సరానికి అనీమియా పరీక్షలు లక్ష్యం 11,835 అయితే ఇప్పటివరకు అయిన పరీక్షలు 9,982 అందులో 3,353 అనీమియా కేసులు గుర్తించడం జరిగింది. ఇందులో 2,902 మందికి చాలా తక్కువగా, 450 మందికి ఒక మోస్తరుగా మరియు ఒక్కరికి తీవ్రంగా రక్తహీనత ఉంది, వీరందరికి ఈ సమస్య నుండి బయటపడడానికి ముఖ్యంగా 5 నుండి 19 సంవత్సరాల వారికి మరియు గర్భిణీ స్త్రీలకూ అవసరమైన వైద్యం అందించి మందులు అందిస్తూ " అనీమియా ముక్త్ భారత్ కోసం అధికారులు కృషి చేస్తున్నారు.

28,800 గర్బిణి స్త్రీలు మరియు 26,670 శిశువులకు 92% పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ క్రింద ప్రతి 15 రోజులకు ఒకసారి ముందస్తు కాన్పులను తగ్గించడానికి స్కాన్లు మరియు రక్త పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి నెల 9 మరియు 10 వ తేదీ అన్ని ప్రభుత్వం ఆస్పత్రులలో గైనకాలజిస్ట్ ద్వారా గర్బీణీ స్త్రీలకు అన్ని పరీక్షలు మరియు సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

జిల్లాలో100 శాతం ప్ర‌స‌వాలు ఆసుప‌త్రుల్లోనే జ‌రుగుతున్నాయ‌ని.. గర్బిణి స్త్రీలకు పోషక ఆహారం కోసం  

జ‌న‌నీ సుర‌క్షా యోజ‌న ( JSY ) ద్వారా 700 రూపాయిలు మరియు సుఖీభవ ద్వారా 300 రూపాయిలు కలిపి మొత్తం 1000 రూపాయిలు చెప్పున ఇప్పటివరకు 7,22 ,300 రూపాయిలు లబ్దిదారులకు వినియోగించడం జరిగింది. అదేవిధంగా జ‌న‌నీ శిశు సంర‌క్ష కార్య‌క్ర‌మం ( JSSK ) ద్వారా ఉచిత పౌష్టికాహారం, మందులు, వైద్య ప‌రీక్ష‌లు వంటి సేవ‌లు కోసం ఇప్పటివరకు 95.25 లక్షల రూపాయిలను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. స్వ‌ర్ణాంధ్ర విజ‌న్ @ 2047 ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించ‌డంపై ప్ర‌భుత్వం దృష్టిసారిస్తోంద‌ని.. ఈ క్ర‌మంలో మాతా శిశు మ‌ర‌ణాల రేటును త‌గ్గించ‌డంపై అధికారుల‌కు సూచ‌న‌లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. 

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన క్రింద మొదటి కాన్పు సమయంలో 5 వేల రూపాయిలు రెండు వాయిదాలలో మరియు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో కాన్పు అయితే మరో వెయ్య రూపాయిలు కలిపి మొత్తం 6 వేలు, రెండవ కాన్పులో ఆడ శిశువుకు జన్మనిస్తే 6 వేలు ప్రోత్సాహకంగా నగదు అందించడం జరుగుతుంది. 2024 - 25 సంవత్సరంలో మొదటి కాన్పు 7,656 మరియు రెండవ కాన్పు ఆడ శిశువు 2,484 కలిపి మొత్తం 11,495 మంది లబ్దిదారులకు 4.46 కోట్ల రూపాయిలు నగదు బదిలీ చేయడం జరిగింది. 2025 - 26 సంవత్సరం నుండి ఈ కార్యక్రమ అమలు భాద్యతను ఐ సి డీ ఎస్ వారికి బదిలీ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.

జిల్లాలో 18 సంవత్సరాలు వయస్సు పైన వారు 17.95 లక్షల మంది ఉంటే ఓరల్ కాన్సర్ 205 మందికి, రొమ్ము కాన్సర్ 508 మందికి మరియు సెర్వికల్ కాన్సర్ 307 మందికి ఉన్నట్లు స్క్రీనింగ్లో తేలింది.

మొత్తం జిల్లాలో 22.42 లక్షల జనాభాలో ప్రస్తుతం 4,339 టీబీ కేసులు ఉండగా, 83 మంది మరణించారు, హెచ్ ఐ వీ పాజిటివ్ ఉన్న టీబీ కేసులలో 8 మంది మరణించారు మరియు ఇతర కారణాలు వల్ల టీబీ కేసులు 92 ఉంటే అందులో 6 మంది మరణించారు. 

2024-25 సంవత్సరానికి 85,348 సాధారణ రక్తపరీక్షలు నిర్వహించగా 1,054 మందికి, 33,304 గర్భిణీ మహిళలకు పరీక్షలు చేయగా 25 మందికి హెచ్ ఐ వీ పాజిటివ్ వచ్చింది. 59,228 యూనిట్ల రక్తమును సేకరించగా అందులో 69 అనుమానాస్పద రక్త నమూనాలను టెస్టుకు పంపగా 15 యూనిట్లలో హెచ్ ఐ వీ కనపడింది.

స్కూల్ ఐ స్క్రీనింగ్ కార్యక్రమం క్రింద జిల్లాలో 360 పాఠశాలలో కంటి పరీక్షలను 43,950 మందికి చేయగా, 3147 మందికి కళ్ళ జోడులు అవసరం అవ్వగా అందరికి అందించడం జరిగింది.

సీజనల్ వ్యాధులు 2023 లో 861 మందికి, 2024 లో 1278 మందికి, 2025 లో ఇప్పటివరకు 1134 మందికి వచ్చాయి, మరణాలు సంభవించ లేదు.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు : ముందస్తు రోగ నిరోధ లక్ష్యంగా ప్రాధమిక ఆరోగ్ర్యం కోసం జిల్లాలో 212 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, 164 భవనాలు మంజూరు అయ్యాయి, 

రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం (ఆర్కెఎస్కె) : 10 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పురుషులు మరియు మహిళలను నగర, గ్రామ ప్రాంతాల్లో, అలాగే పాఠశాలలో చదువుతున్నవారైనా, చదువును మానేసినవారైనా సమగ్రంగా కవర్ చేస్తుంది.

ఈ కార్యక్రమం నిరోధాత్మక, ప్రోత్సాహక మరియు చికిత్సాత్మక సేవలను అందించడంతో పాటు, కౌన్సెలింగ్ మరియు ఆరోగ్య పరీక్షలను కూడా నిర్వహించడం జరుగుతుంది..

రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ( ఆర్బీఎస్కె) :

జననం నుంచి 18 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ బస్తీలు, అలాగే ప్రభుత్వ/సహాయ పాఠశాలల్లో చదివే పిల్లలు.

స్క్రీనింగ్ విధానం:

పుట్టిన శిశువులు: ప్రభుత్వ ఆరోగ్య సదుపాయాల్లో మరియు ఇంటి వద్ద స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది.

6 సంవత్సరాల లోపు పిల్లలు: స్క్రీనింగ్‌ను నియమితంగా అంగన్‌వాడి కేంద్రాల్లో చేస్తారు.

6 నుండి 18 సంవత్సరాల పిల్లలు: మొబైల్ బ్లాక్ హెల్త్ టీమ్‌లు పాఠశాలల్లోనే స్క్రీనింగ్ నిర్వహిస్తాయి.

అందించే సేవలు: ఆరోగ్య పరిస్థితులను నాలుగు విభాగాల్లో ముందస్తుగా గుర్తించడం— జనన సమయంలో లోపాలు (Defects at birth), లోపాలు/పోషకాహార లోపాలు (Deficiencies), రోగాలు (Diseases), ఎదుగుదల ఆలస్యం మరియు వికలాంగులు (Development delays including disabilities)

ఐఎంఆర్ ( ప్రతి వెయ్య మంది శిశువుల జననంలో మరణాల రేట్ ) :  

ప్రస్తుతం రాష్ట్ర సగటు 18 కాగా, గుంటూరు జిల్లా సగటు 7 గా నమోదు అయ్యింది. 

ఎస్ ఆర్ ఎస్ బులిటిన్ 2023 ప్రకారం రాష్ట్ర సగటు 19 గా ఉండేది, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వలు తీసుకున్న సమిష్టి చర్యల వల్ల భారీగా ఐఎంఆర్ ను నియంత్రించ గలిగాం.

ఎంఎంఆర్ ( ప్రతి వెయ్య మంది గర్భిణుల మరణాల రేట్ ) :

ప్రస్తుతం రాష్ట్ర సగటు 39 కాగా, గుంటూరు జిల్లా సగటు 63 గా నమోదు అయ్యింది. 

ఎస్ ఆర్ ఎస్ బులిటిన్ 2023 ప్రకారం రాష్ట్ర సగటు 30 గా ఉండేది, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వలు తీసుకున్న సమిష్టి చర్యల వల్ల భారీగా ఎంఎంఆర్ ను మన జిల్లాలో భారీగా నియంత్రించ గలిగాం.

ఐఎంఆర్ మరియు ఎంఎంఆర్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.l

ఆరోగ్య రక్షణ కోసం స‌మ‌న్వ‌య శాఖ‌ల స‌మ‌ష్టి కృషి

చిన్నారులు, గర్బిణీల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌లు లేకుండా చూడ‌టంలో మరియు పోషక ఆహారం అందించడానికి 6 ఐసీడీఎస్‌ కేంద్రాల ద్వారా 1480 అంగన్వాడీ కేంద్రాలు, వైద్య ఆరోగ్యం మరియు విద్యాశాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్నాన్నారు. 

ఆయుష్మాన్ భార‌త్ - ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న - డా. ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా జిల్లాలో 2024 లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 620 కోట్ల ఖర్చుతో 2.83 లక్షల మందికి వైద్య సేవ‌లు అందాయ‌న్నారు. 108 వాహ‌నాలు ( 19 ) 104 వాహ‌నాలు (21), 102 వాహ‌నాలు ( 18 ) ద్వారా సేవ‌లందుతున్నాయ‌ని.. 108 వాహ‌నాల‌కు సంబంధించి రెస్పాన్స్ టైమ్‌ను త‌గ్గించేందుకు నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ, స‌మ‌న్వ‌యం అవ‌స‌ర‌మ‌ని అధికారుల‌కు సూచించిన‌ట్లు తెలిపారు. 104 వాహ‌నాల ద్వారా 18 మండలాలకు చెందిన 212 విలేజ్ హెల్త్ సెంటర్లకు 58 మెడికల్ ఆఫీసర్లతో నెల‌కు రెండుసార్లు స్థానికుల‌కు సేవ‌లందిస్తున్న‌ట్లు మరియు 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ద్వారా ఈ సంవత్సరం ఇప్పటి వరకు గర్భిణి స్త్రీలకు సేవలు అందించామని పేర్కొన్నారు.

స‌మావేశంలో గుంటూరు వైద్య క‌ళాశాల అభివృద్ధి కార్య‌క‌లాపాల‌పైనా చ‌ర్చ జ‌రిగింద‌ని, .. పీఎం స్వాస్థ్య సుర‌క్షా యోజ‌న (పీఎంఎస్ఎస్‌వై) ద్వారా సూప‌ర్ స్పెషాలిటీ సేవ‌లు, మౌలిక వ‌స‌తుల అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. 

జిల్లాలో మొత్తం 9.09 లక్షల అర్హులైన వారికిగాను ఇప్పటివరకు 8.79 లక్షల పీఎంజేఏవై కార్డులు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు, మిగిలిన వారికి కూడా సత్వరం పంపిణీ చేయాలని అధికారులను లంకా దినకర్ ఆదేశించారు. అలాగే, 70 సంవత్సరాలు పైబడిన వారు 1.55 లక్షల లబ్ధిదారులు ఉంటే ఇప్పటి వరకు 14.50 వేల మంది మాత్రమే కార్డులు తీసుకున్నారు.

విద్యా రంగం :

బేటీ బచావో బేటీ పడావో - 11 నుండి 14 సంవత్సరాల వయస్సు వారు 1.26 లక్షల మంది మరియు 15 నుండి 18 సంవత్సరాల వయస్సు వారు 1 లక్ష మంది మొత్తం 2.26 లక్షల మంది 9,440 గ్రూపులు ద్వారా చదువు ఆవశ్యకత మరియు మంచి చెడు ప్రవర్తన పైన అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తల్లికి వందనం : 

సమగ్ర శిక్ష అభియాన్ - సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర : 

ఎలిమెంట్రీ నుండి సెకండరీ విద్యా వరకు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు చదువుకు అవసరమైన నోట్ పుస్తకాలు, వర్క్ బుక్ మరియు టెక్స్ట్ పుస్తకాలు, ఆక్స్ఫర్డ్ మరియు ఇతర డిక్షనరీలు, విద్యార్థులకు బ్యాగ్, యూనిఫామ్ , షూ , బెల్ట్ పంపిణీ తదితర సౌకర్యాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సమగ్ర శిక్ష అభియాన్ కు అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి నిర్వహిస్తున్నాం.

మన బడి - మన భవిష్యత్తు - పీఎం శ్రీ యోజన:

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం లక్ష్యంగా సురక్షిత త్రాగు నీరు, స్వచ్ఛత కోసం మరుగుదొడ్లు, భవనాల మరియు ఫర్నిచర్ ఆధునీకరణ నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా విద్యార్థుల ఆరోగ్య భద్రత మరియు పరిసరాల పరిశుభ్రత ధ్యేయంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్వహించ బడుతున్నాయి.

జిల్లాలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో పీఎం శ్రీ పాఠశాలలు నిర్వహించడం జరుగుతుంది.

త్వరలో ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది 

డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం - పీఎం పోషణ్ :

నాణ్యమైన సన్న బియ్యంతో జిల్లాలో జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైమరీ 812, అప్పర్ ప్రైమరీ 44, హై స్కూల్ 193 కలిపి 1049 పాఠశాలలో 88019 విద్యార్థులు ఉండగా 73043 హాజరు అవుతుండగా, అందులో 69521 మంది విద్యార్థులకు వారంలో 5 రోజులు కోడి గుడ్డుతో పౌష్టికాహార మధ్యాహ్నం భోజనం కేంద్ర ప్రభుత్వం పథకం పీఎం పోషణ తో అనుసంధానంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం మన జిల్లాలో అమలు అవుతుంది.

స్కూల్ హెల్త్ & వెల్నెస్ ప్రోగ్రామ్ :

ఆరోగ్య మరియు విద్యా శాఖ సమన్వయంతో కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ అమలు కింద హెల్త్ స్క్రీనింగ్, పోషక విలువలతో కూడిన మాత్రలు, ఆరోగ్య పరీక్షలు మరియు అవగాహన కార్యక్రమాలు ముందస్తు వ్యాధినిరోధక చర్యలు ధ్యేయంగా చేపడుతున్నాం.

జిల్లాలో విద్యార్థులకు ఈ సేవలు అందుతున్నాయ.

జవహర్ బాల ఆరోగ్య రక్ష :

విటమిన్ A మరియు D టాబ్లెట్లు సంవత్సరానికి రెండు సార్లు, ఐరన్ మరియు పోషక విలువలు తగ్గి రక్తహీనత ఉన్న విద్యార్థులకు తగిన పోషక విలువలను అందించే కార్యక్రమం జరుగుతుంది.

స్వ‌ర్ణాంధ్ర సాధ‌న‌కు సుర‌క్షిత తాగునీరు కూడా ఒక కీల‌క అంశ‌మ‌ని.. జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌కు సంబంధించి మొత్తం ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకుంటూ ముందుకెళ్ల‌డం జ‌రుగుతోంద‌ని, రూ. కోట్ల మేర ఉన్న ప్రాజెక్టు వ్యయం నేడు వేల కోట్లు వరకు అవుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధికారులు సరైన సమాచారం, ప్రణాళికలతో సిద్ధం కావాలని సూచించినట్లు తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో అమృత్ 1.0 కింద దాదాపు రూ. కోట్లతో చేపట్టిన పనులు పూర్తికావొస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగానూ తాగునీటి సరఫరా ప్రణాళికలు అమృత్ 2.0 సిద్ధం చేయాలని అధికారుల‌కు సూచించినట్లు పేర్కొన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం అమల్లోనూ వేగం పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.రమణ,  

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు,

గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి,  

ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, నగర పాలక సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ సుందరరామి రెడ్డి, ప్రజా ఆరోగ్య శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస్, తెనాలి మున్సిపాలిటీ కమిషనర్ జె .రామ అప్పల నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-