రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

విద్యతోనే బీసీలు శాసించే స్థాయికి..

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

విద్యతోనే బీసీలు శాసించే స్థాయికి..

  • రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
  • బీసీల అభివృద్ధే అభిలాషగా పని చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  • వెనుకబడిన తరగతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
  • ఎన్నికల హామీ మేరకు ఒడ్డే ఓబన్న జయంతికి శాశ్వత జీవో జారీ : మంత్రి సవిత
  • ఘనంగా వడ్డే ఓబన్న రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు

అనంతపురము, జనవరి11: కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిసి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు  ఎస్.సవితమ్మ, ఎంపీలు అంబికా లక్ష్మీ నారాయణ, పార్థసారథి, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వడ్డర్ల కార్పొరేషన్ చైర్మన్ మల్లెల మురళి, బిసి సంక్షేమ శాఖ సంచాలకులు మరియు వీసీ అండ్ ఎండీ మల్లిఖార్జున, అనంతపురము జిల్లా ఇంచార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, తదితరులు..

బ్రిటిష్ నిరంకుశ పాలనకు ఎదురొడ్డి ప్రజల హక్కుల కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న  219వ జయంతి వేడుకలు ఆదివారం అనంతపురము నగరంలోని లలిత కళా పరిషత్ వేదికగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ ఎస్. సవితమ్మ పాల్గొన్నారు.

మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో అనంతపురం, హిందుపురం ఎంపీలు అంబికా లక్ష్మీ నారాయణ, పార్థసారథి, అర్బన్ ఎమ్మెల్యే మరియు సభాధ్యక్షులు దగ్గుపాటి ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వడ్డర్ల కార్పొరేషన్ చైర్మన్ మల్లెల మురళి, బిసి సంక్షేమ శాఖ సంచాలకులు మరియు వీసీ అండ్ ఎండీ మల్లిఖార్జున, అనంతపురము జిల్లా ఇంచార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర రావు, దేవళ్ళ మురళి,వడ్డె అంజనప్ప, మల్లెల జయరాం, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు, వడ్డెర సంఘ ప్రతినిధులు, బిసి కులాల ప్రతినిధులు, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి రామ్మోహన్, అహుడా సెక్రటరీ రామకృష్ణారెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి ఖుష్బూ కొఠారి, బిసి కార్పొరేషన్ ఈడి రామసుబ్బయ్య, తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ సందర్భంగా రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు  ఎస్.సవిత మాట్లాడుతూ విద్యతోనే బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరుకోగలరని స్పష్టంచేశారు. అనంతపురం నగరంలో ఆదివారం నిర్వహించిన ఒడ్డే ఓబన్న రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీ లు, ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు, వడ్డెర సంఘ నాయకులతో కలసి మంత్రి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందే బ్రిటీషర్ల దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన యోధుడు వడ్డే ఓబన్న అని వారు కొనియాడారు. అమరజీవులు వడ్డే ఓబన్న 129 వ జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించుకోవడం ఎంతగానో సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతి రాష్ట్ర వేడుకగా ప్రకటించినప్పుడు మొదటి కార్యక్రమం గుంటూరు నందు నిర్వహించుకున్నామని, ఇప్పుడు మన అనంతపురము జిల్లాలో నిర్వహించుకోవడం, అందరి సహకారం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బిసిలకు గుర్తింపు ఇచ్చిన, అండగా నిలిచిన వారు ఎన్టీఆర్ , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బిసిల సంక్షేమం కోసం మొదట సమావేశం నిర్వహించారని, బీసీల పట్ల నిజమైన నిబద్ధత కలిగిన ప్రభుత్వం ఇదే అని అన్నారు. బిసి మహిళగా ఉన్న తనకు బిసి సంక్షేమ శాఖ మంత్రిగా సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. యువ నాయకుడు నారా లోకేష్  యువగళం పాదయాత్రలో వడ్డర్లకు ఇచ్చిన హామీ మేరకు వారికి మేలు చేయాలని నిబద్ధతతో వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా శాశ్వతంగా రాష్ట్ర వేడుకగా జరుపుకోవాలని జి.ఓ వచ్చేలా కృషి చేశారని, ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. విద్యావంతులుగా అయినపుడే పురోగతి ఉంటుందని తెలుపుతూ, మన రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని, తల్లికి వందనం తదితర విద్యా పథకాలలో ఎక్కువ మంది బిసిలు ఈ విద్యా ఫలాలు వినియోగించుకుంటున్నారని సంతోషంగా ఉందని అన్నారు. వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని, బిసిలకు ఎంఎస్ఎమ్ఈ పార్కుల కేటాయింపులో రిజర్వేషన్ కల్పిస్తున్నామని అన్నారు. క్వారీలలో 15 శాతం వడ్డర్లకు రిజర్వేషన్ కల్పించడం హర్షించదగినదన్నారు. కూటమి ప్రభుత్వంలోనే బిసిలకు న్యాయం జరుగుతోందన్నారు. ఆదరణ 1,2 ల అమలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయని, ఇప్పుడు ఆదరణ 3.ఓ కూడా పక్కాగా అమలుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో వడ్డర్లకు పనిముట్లు ప్రాధాన్యతగా అందిస్తామని అన్నారు. బీసీల పక్షపాతి, బీసీలే శ్వాస, బీసీలే ధ్యాస, బీసీల అభివృద్ధే అభిలాషగా పని చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. బీసీ గురుకుల పాఠశాలల పునరుద్ధరణ పనులు చేపట్టాం, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం అన్నారు. ఒకపక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ, ఒక పక్క రాష్ట్రానికి సంపద సృష్టిస్తూ పరిశ్రమలు తీసుకొస్తు మన బిడ్డలకు ఉపాధి చూపించడానికి మన ముఖ్యమంత్రి, మన డిప్యూటీ సీఎం, క్యాబినెట్ మరి ప్రజాప్రతినిధులు అందరూ కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి దశా దిశ మేరకు ఏదైతే జనాభా దామాషా ప్రకారం నిధులు విధులు కూడా కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని, అంతే కాకుండా బీసీల రక్షణ చట్టం కొరకు కూడా అడుగులు వేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంత అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతున్నదన్న విషయం గుర్తు చేసారు.

బిసి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ మల్లిఖార్జున మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి వడ్డే ఓబన్న జయంతి వేడుకల సందర్భంగా వడ్డెర్లందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వడ్డే ఓబన్న  తొలి తరం స్వాతంత్ర్య సమర యోధుడు అని, ఆయన త్యాగాలను కృషిని గుర్తించి వారి జయంతిని రాష్ట్ర వేడుకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న వడ్డెరలు వారి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు.

జిల్లా ఇంచార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ మాట్లాడుతూ మన జిల్లాలో 219వ జయంతి రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతగానో సంతోషంగా ఉందని అన్నారు. తొలి తరం స్వాతంత్ర్య సమర యోధుడు 1846 జూలై 10న కోవెలకుంట్ల తహసీల్దార్ కార్యాలయం మరియు ఖజానాపై దాడి చేసి బ్రిటిష్ పాలనలో పీడనకు గురైన రైతులకు పంచి పెట్టిన గొప్ప మహానుభావుడు, సాహసి వడ్డే ఓబన్న అన్నారు. వడ్డే ఓబన్న స్పూర్తిగా నిజాయితీకి ధైర్యంగా నిలవడం, పేదలకు అండగా నిలవడం వంటివి కొనసాగించాలని అన్నారు.

ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన రేనాటి వీరుడు అని కొనియాడారు. 1857 సిపాయిల తిరుగుబాటు కన్నా ముందుగానే రైతుల కష్టం దోపిడీకి గురి కాకూడదని, మన దేశ ప్రజలపై బ్రిటిష్ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని పోరాడారని అన్నారు. సమైక్యంగా మనం అందరం ఏదైనా సాధించుకోవచ్చు అని అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. వడ్డర్లకు ఆదరణ పనిముట్లు అందించడానికి, వడ్డర్లకు మైనింగ్ నందు 15 శాతం రిజర్వేషన్ కల్పించడం వంటి ఎన్నో అంశాలు ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు.

హిందూపురం ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ మన జిల్లా బీసీల గడ్డ అని, వడ్డే ఓబన్న గారి 219 వ జయంతి రాష్ట్ర పండుగగా జరుపుకోవడం అదీ మన జిల్లాలో జరుపుకోవడం ఎంతో సంతోషం ఉందన్నారు. వడ్డర్ల యుగపురుషుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. వడ్డర్లు కూడా తాము ఎదిగేందుకు కృషి చేయాలని, విద్యావంతులు కావాలని అన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో, నేడు చంద్రబాబు నాయకత్వంలో పలువురు బీసీలకు, వడ్డర్లకు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో సముచిత స్థానాన్ని కల్పించారని అన్నారు. ఐక్యతగా ఉండి సాధించాలని అన్నారు. ఓబులదేవర చెరువు నందు వడ్డర్లకు కల్యాణ మండపం నిర్మిస్తున్నామని, బి.సి ఎంపీగా తాను కూడా బిసి సంక్షేమం కొరకు కోటి రూపాయలతో కళ్యాణ మండప నిర్మాణాలు పలు చోట్ల చేపడుతున్నామని పేర్కొన్నారు.

రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ మల్లెల ఈశ్వర రావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బిసిల సంక్షేమ ప్రభుత్వం అని దానికి నిదర్శనమే వడ్డే ఓబన్న జయంతి రాష్ట్ర వేడుకగా ప్రకటించిందని అన్నారు. వడ్డర్ల అభివృద్ధికి మైనింగ్ జీ.ఓ ద్వారా 15 శాతం కేటాయించడం నిదర్శనం అన్నారు. ఓబన్న  స్ఫూర్తిగా మనం నడుద్దామని అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ వడ్డె ఓబన్న  జయంతి రాష్ట్ర స్థాయి వేడుకలు మన అనంతపురము జిల్లాలో జరగడం ఎంతో సంతోషంగా ఉందని, మంత్రి సవిత గారికి ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడి ఉన్న వడ్డెర సోదరుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వారికి పనిముట్లు, మైనింగ్ రిజర్వేషన్ తదితర అంశాలను అమలు చేస్తోందని, పట్టణంలో వడ్డే ఓబన్న విగ్రహం అనివార్య కారణాల వలన ఏర్పాటు కాలేదు అని, వచ్చే సంవత్సరం వడ్డే ఓబన్న గారి విగ్రహావిష్కరణ చేసుకుందామని అన్నారు.

ఎమ్మెల్యే మడకశిర ఎమ్.ఎస్ రాజు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డిన తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న అని, రాష్ట్ర వేడుకగా మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తన నియోజకవర్గంలో మడకశిర నందు వడ్డే ఓబన్న గారి విగ్రహం తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తామన్నారు. వడ్డెరలకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని పేర్కొన్నారు.

ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు చైర్మన్, పలువురు వడ్డెర సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ తొలి నాటి స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి రైతుల పక్షాన పోరాడారని వారు ఆదర్శనీయులు అని పేర్కొన్నారు.

కార్యక్రమం చివరలో మంత్రి చేతుల మీదుగా పలువురు వడ్డర్లకు సన్మానం చేయగా, మంత్రిని పలువురు వడ్డెర సోదర సోదరీమణులు, అధికారులు సముచితంగా సత్కరించారు.

Comments

-Advertisement-