రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మార్చి 1 నుంచి ఈ సేవలు బంద్..
రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మార్చి 1 నుంచి ఈ సేవలు బంద్..
న్యూఢిల్లీ – ఫిబ్రవరి 12 – పీపుల్స్ మోటివేషన్
రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక సూచన జారీ చేసింది. ఇప్పటివరకు అన్‌రిజర్వుడ్, ఫ్లాట్‌ఫామ్ టికెట్ల బుకింగ్‌తో పాటు ఇతర సేవలు అందించిన యూటీఎస్ యాప్‌ను మార్చి 1 నుంచి దశలవారీగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ యాప్ స్థానంలో కొత్తగా రైల్ వన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
ఇకపై రైల్వేలకు సంబంధించిన అన్ని సేవలు ఒకే వేదికలో అందించాలనే ఉద్దేశంతో రైల్ వన్ యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు. టికెట్ల బుకింగ్, భోజన సేవలు, రైళ్ల ట్రాకింగ్, ఫిర్యాదులు వంటి సేవలు అన్నీ ఒకేచోట లభించనున్నాయి. ఇప్పటివరకు టికెట్ల కోసం వేర్వేరు యాప్‌లు ఉపయోగించాల్సి వచ్చేది. కొత్త యాప్‌తో ఆ అవసరం ఉండదని పేర్కొన్నారు.
మొదటి దశలో యూటీఎస్ యాప్‌లో టికెట్ బుకింగ్, కొత్త వినియోగదారుల నమోదు సేవలను నిలిపివేశారు. ఫ్లాట్‌ఫామ్ టికెట్ల బుకింగ్, ఆర్ వాలెట్ రీఛార్జ్ వంటి సేవలు కూడా ఇప్పటికే నిలిచిపోయాయి. తాజా వెర్షన్ ఉపయోగిస్తున్న ప్రయాణికులు ఈ సేవలను వినియోగించలేకపోతున్నారు.
అయితే యూటీఎస్ యాప్‌లో ఇప్పటికే ఉన్న ఆర్ వాలెట్ బ్యాలెన్స్ సురక్షితంగానే ఉంటుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఆ మొత్తాన్ని రైల్ వన్ యాప్‌లో ఉపయోగించుకోవచ్చని తెలిపింది. కొత్త యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్, ఫ్లాట్‌ఫామ్ టికెట్లతో పాటు రిజర్వుడ్ టికెట్ల సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
