రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వైసీపీపై కూటమి నేతల ఘాటు విమర్శలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వైసీపీపై కూటమి నేతల ఘాటు విమర్శలు

- భక్తుల మనోభావాలతో ఆటలాడొద్దని హెచ్చరిక

- ధర్మ పరిరక్షణలో వెనుకడుగు లేదని స్పష్టం

- దుశ్చర్యలు పునరావృతమైతే ప్రతిఘటన తప్పదని వ్యాఖ్య

అనంతపురం, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్): శ్రీవారి చిత్రపటంతో వ్యవహరించిన తీరు పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడాన్ని సహించబోమని హెచ్చరించారు. వైసీపీ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

పాత్రికేయుల సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు, అహుడ చైర్మన్ టి.సి.వరుణ్ మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం వెంకన్న చిత్రపటాన్ని ప్లకార్డుగా ఉపయోగించడం అనుచితమని విమర్శించారు. భక్తుల విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దురుద్దేశపూరిత చర్యగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ధర్మ పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ఎలాంటి వ్యూహాన్నైనా తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు పునరావృతమైతే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు నాగరాజు, బిజెపి జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు రాజేష్, జనసేన నాయకులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమీలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. వైసీపీ నాయకత్వం తీరును తీవ్రంగా ఖండిస్తూ ప్రజల విశ్వాసాలను గౌరవించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

-Advertisement-