రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నామకరణ మహోత్సవానికి హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

నామకరణ మహోత్సవానికి హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ

- జహీరాబాద్‌లో ఘనంగా నామకరణ వేడుక

- శ్రీధర్–నాగలక్ష్మి దంపతులకు శుభాకాంక్షలు

- చిన్నారి తన్వికను లాలించిన మంత్రి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

జహీరాబాద్, 18 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్):
తన వ్యక్తిగత సహాయకుడు శ్రీధర్–నాగలక్ష్మి దంపతుల కుమార్తె నామకరణ మహోత్సవానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరయ్యారు. జహీరాబాద్‌లోని పద్మశాలి భవనంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీధర్ దంపతులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. పాపకు తన్విక అని పేరు పెట్టిన సందర్భంగా ఆమెను ఎత్తుకుని లాలించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.

కార్యక్రమం సందర్భంగా శ్రీధర్ కుటుంబ సభ్యులతో మంత్రి కాసేపు సరదాగా గడిపారు. చిన్నారికి ఆశీస్సులు అందజేసి సుభిక్షమైన భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు. వేడుకలో బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మంత్రి హాజరుతో కార్యక్రమం మరింత ప్రత్యేకత సంతరించుకుంది.

Comments

-Advertisement-