రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గచ్చిబౌలిలో డ్రగ్స్ ముఠా అరెస్ట్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

గచ్చిబౌలిలో డ్రగ్స్ ముఠా అరెస్ట్

- అదుపులో వ్యాపారులు, విద్యార్థి సహా ముగ్గురు 

- 15 గ్రాముల కొకైన్ స్వాధీనం

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్): గచ్చిబౌలిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను ఈగల్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఇద్దరు వ్యాపారులు, ఒక విద్యార్థి సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 15 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మురళీకృష్ణంరాజుతో పాటు వ్యాపారవేత్తలు చిరంజీవి వర్మ, హేమంతరాజును అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నైజీరియా దేశస్థుల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ ముఠా నగరంలోని సుమారు 15 మంది ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్‌ను చాక్లెట్ గిఫ్ట్ ప్యాకుల్లా తయారు చేసి ర్యాపిడో సేవల ద్వారా డెలివరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

-Advertisement-