రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్

  • ముందస్తు బెయిల్ పిటిషన్ తోసిపుచ్చిన ధర్మాసనం
  • 26లోపు విచారణాధికారికి లొంగిపోవాలని ఆదేశం
  • అంతర్జాతీయ లావాదేవీల కోణంపై కోర్టు దృష్టి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ–7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ నిరాశ ఎదురైంది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. విచారణ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేస్తూ, చట్టం నుంచి తప్పించుకోవడం ద్వారా ఉపశమనం పొందలేరని పేర్కొంది. ఈ నెల 26వ తేదీ లోపు సంబంధిత విచారణాధికారి ఎదుట స్వయంగా హాజరై లొంగిపోవాలని డెడ్‌లైన్ విధించింది. ముందుగా లొంగిపోయిన తరువాతే సాధారణ బెయిల్ కోసం నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. లిక్కర్ స్కామ్ ద్వారా అక్రమంగా సంపాదించిన నిధులు విదేశాలకు తరలించబడినట్లు ఆరోపణలు ఉన్నాయని కోర్టు గమనించింది. అవినాశ్ రెడ్డి ద్వారా రాజ్ కేసిరెడ్డి విదేశాల్లో నిధులు దాచినట్లు ఆరోపణలు ఉన్నాయని విచారణలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కేసు అంతర్జాతీయ కోణం కలిగి ఉండటంతో దర్యాప్తు ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో అవినాశ్ రెడ్డి లొంగిపోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఆయన లొంగిపోయిన తరువాత జరిగే విచారణలో మరికొంత మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Comments

-Advertisement-