రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

విశాఖలో మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

విశాఖలో మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం

- న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

- తినుబండారాలు కొనిస్తానని మాయమాటలు

- నిందితుడిపై పోక్సో కేసు నమోదు


విశాఖపట్నం, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్):
విశాఖ నగరంలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగిన ఘటన కలకలం రేపింది. చిన్నారిని తినుబండారాలు కొనిపెడతానని నమ్మబలికి తీసుకెళ్లిన వ్యక్తి దారుణానికి పాల్పడేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలికను రక్షించారు. బాధిత చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా ఎరిపిల్లి యోగి అనే వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఘటనతో ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది.

Comments

-Advertisement-