రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం కు ఆహ్వానం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం కు ఆహ్వానం

  • అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ
  • ఆహ్వాన పత్రిక, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాల అందజేత
  • భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టికి ఆదేశాలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 7, 2026 (పీపుల్స్ మోటివేషన్):
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఆహ్వానం అందింది. శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేశ్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు నేడు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబుకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికతో పాటు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ పండితులు వేదమంత్రాలతో ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను శాసనసభ్యులు, ఆలయ బోర్డు సభ్యులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన సీఎం చంద్రబాబు, ఉత్సవాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు అవసరమైన వసతులు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.

ఇదే క్రమంలో, నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా హాజరుకావాల్సిందిగా శాసనసభ్యులు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ఉండాలన్నారు.

Comments

-Advertisement-