టీపీసీసీ బాధ్యతలు స్వీకరించినప్పుడు పార్టీ పరిస్థితి క్లిష్టం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
టీపీసీసీ బాధ్యతలు స్వీకరించినప్పుడు పార్టీ పరిస్థితి క్లిష్టం
- డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం
- భిన్నాభిప్రాయాలకు కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉందని వ్యాఖ్య
- కష్టపడి పనిచేసిన వారికి అవకాశాలు ఖాయం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వికారాబాద్, ఫిబ్రవరి 21 (పీపుల్స్ మోటివేషన్): తాను టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో కొందరి నుంచి వ్యతిరేకత ఎదురైనా, నేతలందరినీ కలిసి తన ఆలోచనలను వివరించి వారిని ఒప్పించానని గుర్తుచేశారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఎప్పటి నుంచో స్వేచ్ఛ ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. భిన్నాభిప్రాయాలు చెప్పినంత మాత్రాన వారిని వేధించే సంస్కృతి కాంగ్రెస్‌లో లేదన్నారు. అంతర్గత విభేదాలు పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తాయని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తెలంగాణలో పార్టీ పునరుద్ధరణ అందరి కృషి ఫలితమని ఆయన పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షులుగా కృషి చేసిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చామని, టిక్కెట్లు రాని వారికి ఎమ్మెల్సీ అవకాశాలు కల్పించామని తెలిపారు. మరో అరవై మందికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చినట్లు వెల్లడించారు. పార్టీలో పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని హెచ్చరించారు. మెరిట్ ఆధారంగానే అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.
డీసీసీ పదవి ఎంతో విలువైనదని, దాన్ని దుర్వినియోగం చేయకూడదని హితవు పలికారు. ప్రతిభ కనబరిస్తే ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి పదవులు కూడా సాధ్యమని అన్నారు. నాయకులు ప్రజల్లో ఉండాలని సూచిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాహుల్ గాంధీ పాదయాత్రలను ప్రస్తావించారు. దేశం కోసం త్యాగాలు చేసిన మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను స్మరించారు.
Comments
