రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫ్లాగ్ మార్చ్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫ్లాగ్ మార్చ్

  • గడ్డపోతారం గ్రామంలో పోలీసుల కవాతు
  • ప్రజల్లో భద్రతా భావం పెంపుదలే లక్ష్యం
  • శాంతియుతంగా ఓటింగ్ జరిగేలా చర్యలు

గడ్డపోతారం, ఫిబ్రవరి 7, 2026 (పీపుల్స్ మోటివేషన్): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలు పటిష్టం చేయడమే లక్ష్యంగా ఐడీఏ బొల్లారం పోలీసులు నేడు గడ్డపోతారం గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కవాతు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అనుకూల పరిస్థితులు కల్పించడమే ఈ ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశ్యమని పోలీసులు పేర్కొన్నారు. విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు ధైర్యం కల్పించి, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఎన్నికల సమయంలో ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటిస్తూ సహకరించాలని సూచించారు. గ్రామంలో పోలీసులు విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐడీఏ బొల్లారం ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ ఎలాంటి భయాందోళనల లేకుండా స్వేచ్ఛగా, ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Comments

-Advertisement-