సాక్షి మీడియాకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
సాక్షి మీడియాకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు
- వ్యక్తిగత గౌరవానికి భంగమంటూ ఆరోపణ
- బేషరతు క్షమాపణ కోరిన డిప్యూటీ స్పీకర్
- నష్టపరిహారంగా కోటి రూపాయలు డిమాండ్
అమరావతి, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): సాక్షి మీడియాకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచురించారని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఇందిరా టెలివిజన్ వ్యవస్థాపక నిర్వాహకురాలు వైఎస్ భారతి, బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్‌లకు రఘురామ తరఫు న్యాయవాది ఉమేశ్ చంద్ర నోటీసులు పంపారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని పేర్కొంటూ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు, నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని, ఆ మొత్తాన్ని అమరావతి రైతులకు అందజేస్తానని నోటీసులో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు పంపిన ఈ నోటీసులపై వైఎస్ భారతి మరియు సంబంధిత ప్రతినిధులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
