రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

2026 మహా శివరాత్రి సందర్భంగా ఘనంగా బ్రహ్మోత్సవాలు

మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో సీఎం వద్దకు ప్రతినిధుల బృందం

ప్రత్యేక ఆశీర్వచనలు అందించిన ఆలయ అర్చకులు

కీసరగుట్ట, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న “కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు–2026”కు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి అధికారికంగా ఆహ్వానం అందజేశారు. ఈ వేడుకలు కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్ కలిసి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రహ్మోత్సవాల వివరాలు, ఏర్పాట్లపై సంక్షిప్తంగా వివరణ ఇచ్చారు.

మహా శివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు కీసరగుట్టకు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో భద్రత, సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లపై సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు మెరుగైన వసతుల కల్పనపై ప్రభుత్వం సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ప్రత్యేక ఆశీర్వచనలు అందించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించినట్లు అధికారులు తెలిపారు.

Comments

-Advertisement-