రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నరేగా పనులు మార్చి 28 నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

నరేగా పనులు మార్చి 28 నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

- సీసీ రోడ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్ష

- రూ.25.77 కోట్లతో 398 పనుల వేగవంతం

- నెలాఖరు లోపు రూ.14 కోట్ల బిల్లుల చెల్లింపుకు ఆదేశాలు

పెద్దపల్లి, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్): జిల్లాలో నరేగా ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నరేగా కింద జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణం మరియు ఇతర పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నరేగా క్రింద చేపట్టిన అభివృద్ధి పనులు గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణం గ్రామాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుందని, ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. మొత్తం రూ.25.77 కోట్ల వ్యయంతో చేపట్టిన 398 సీసీ రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనులను మార్చి 28 నాటికి పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా ఆలస్యం లేకుండా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

అలాగే పనులు పూర్తి అయిన వెంటనే బిల్లుల చెల్లింపును ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. నెలాఖరు లోపు రూ.14 కోట్ల బిల్లులను చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కూలీలకు, కాంట్రాక్టర్లకు సమయానికి చెల్లింపులు జరగడం ముఖ్యమని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, పంచాయతీ రాజ్ ఈఈ శంకరయ్య, డీఈలు, ఏఈలు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నరేగా పనులను సమన్వయంతో పూర్తి చేసి గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.

Comments

-Advertisement-