రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

- మంగళగిరిలో జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

- రాష్ట్రవ్యాప్తంగా పసుపు జెండాల సంబరం

మంగళగిరి, మార్చి 29 (పీపుల్స్ మోటివేషన్): తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు పండుగలా జరుపుకుంటున్నాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా పసుపు జెండాలు ఎగురుతూ, కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. 1982లో స్థాపించబడిన ఈ పార్టీ నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. భారీ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యకర్తల నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ పట్ల ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించారు.

కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలను చంద్రబాబు వ్యక్తిగతంగా పలకరించారు. వారితో మమేకమై, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయత కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. వేదికపై ఉన్న ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం, పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్న సీనియర్ కార్యకర్తలను వేదికపైకి ఆహ్వానించి వారితో కలిసి కూర్చోవడం విశేషంగా నిలిచింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ టీడీపీ శ్రేణులు వేడుకలు నిర్వహించాయి. పార్టీ జెండాలు ఎగురవేసి, మిఠాయిలు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. 44 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న టీడీపీ, భవిష్యత్తులో మరింత బలంగా ఎదగాలని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

-Advertisement-