యాదాద్రిలో విషాదం అప్పుల భారంతో రైతు బలవన్మరణం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
యాదాద్రిలో విషాదం అప్పుల భారంతో రైతు బలవన్మరణం
పంట నష్టంతో తీవ్ర ఆవేదన
రూ.20 లక్షల అప్పులు భారం
పురుగుల మందు తాగి ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి, మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్): యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్పుల భారాన్ని తట్టుకోలేక రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన రైతు నాతి మల్లయ్య గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, మల్లయ్య గౌడ్ తనకున్న నాలుగు ఎకరాల భూమితో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని మొత్తం ఆరు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట కోసం భారీగా పెట్టుబడి పెట్టి, దొరికిన చోటల్లా అప్పులు చేసి వ్యవసాయం కొనసాగించాడు. అయితే పంట చేతికొచ్చే సమయానికి సాగునీరు అందకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. ఈ పరిస్థితితో మల్లయ్య తీవ్రంగా నష్టపోయాడు. ఇప్పటికే తీసుకున్న వ్యవసాయ అప్పులకు తోడు, కూతురు పెళ్లి కోసం చేసిన ఖర్చులు కూడా అతనిపై మరింత భారంగా మారాయి. మొత్తం సుమారు రూ.20 లక్షల అప్పు ఎలా తీర్చాలనే ఆందోళనతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అప్పుల ఒత్తిడి, పంట నష్టం కారణంగా నిరాశలోకి వెళ్లిన మల్లయ్య చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైతుల ఆత్మహత్యల సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
