రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం

- పరీక్షల రోజుల్లో ప్రత్యేక సౌకర్యం

- 6.42 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం

- హాల్ టికెట్ చూపితే చాలు

అమరావతి, 5 మార్చి (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.42 లక్షల మంది విద్యార్థులు 3,415 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు సులభంగా పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించే పరీక్షల సమయంలో విద్యార్థులు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు మరియు సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు మరియు తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. బస్సులో ప్రయాణించే సమయంలో విద్యార్థులు తమ పదో తరగతి హాల్ టికెట్‌ను కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Comments

-Advertisement-