రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అద్దంకి అభివృద్ధిపై భేటీ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

అద్దంకి అభివృద్ధిపై భేటీ

- నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం సమర్పణ

- రోడ్లు, తాగునీటి మౌలిక వసతులపై చర్చ

- అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, మార్చి 6 (పీపుల్స్ మోటివేషన్):
అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సవివరంగా చర్చించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టాల్సిన పనులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి వంటి మౌలిక వసతుల మెరుగుదలపై ఉప ముఖ్యమంత్రితో మంత్రి గొట్టిపాటి రవికుమార్ చర్చించారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం కూడా సమర్పించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పనులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు. అద్దంకి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందనే ఆశాభావాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యక్తం చేశారు.

Comments

-Advertisement-