రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సిరిసిల్ల నేతన్నల సమస్యలపై కేటీఆర్ వినతి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

సిరిసిల్ల నేతన్నల సమస్యలపై కేటీఆర్ వినతి

  • విద్యుత్ బిల్లుల భారం మాఫీ చేయాలని డిమాండ్
  • ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో కేటీఆర్ భేటీ
  • నేతన్నల జీవనోపాధి ప్రమాదంలో ఉందని ఆందోళన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్):
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను రక్షించాలని కోరుతూ కేటీఆర్ కీలకంగా ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులను కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. పవర్‌లూమ్ యూనిట్లపై పెరిగిన విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారాన్ని తగ్గించాలని కోరారు. సిరిసిల్లలోని పవర్‌లూమ్ యూనిట్లపై విధించిన ‘బ్యాక్ బిల్లింగ్’ కారణంగా పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడిందని కేటీఆర్ వివరించారు. గత ప్రభుత్వ కాలంలో 25 హెచ్‌పి వరకు విద్యుత్ సబ్సిడీ అందించడంతో పరిశ్రమ నిలదొక్కుకున్నదని, కానీ ప్రస్తుతం విధిస్తున్న అదనపు బిల్లుల వల్ల పరిస్థితి క్షీణించిందని తెలిపారు. 2016 నుండి 2024 మధ్య కాలానికి సంబంధించిన సుమారు 127 చిన్న పరిశ్రమ యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ విధించగా, సర్‌చార్జిలతో కలిపి అది రూ. 38 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఈ భారీ భారం కారణంగా యూనిట్లు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నాయని చెప్పారు.

ఈ పరిస్థితుల్లో అనేక పవర్‌లూమ్ యూనిట్లు మూతపడటంతో పాటు వేలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని తెలిపారు. మానవీయ కోణంలో ఈ విద్యుత్ బిల్లుల భారాన్ని పూర్తిగా రద్దు చేసి సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పరిశ్రమను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

-Advertisement-