రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కల్తీ పాల ఘటనపై రాజ్యసభలో చర్చ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కల్తీ పాల ఘటనపై రాజ్యసభలో చర్చ

  • రాజమండ్రి ఘటన ప్రస్తావన
  • కల్తీదారులకు కఠిన శిక్షల డిమాండ్
  • మృతుల కుటుంబాలకు పరిహారం కోరింపు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, మార్చి 24 (పీపుల్స్ మోటివేషన్):
రాజమండ్రిలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించగా, ఈ విషయాన్ని రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి ప్రస్తావించారు. కల్తీ పాల కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిపై కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లాలాచెరువు ప్రాంతంలో కల్తీ పాల వల్ల 16 మంది మృతి చెందిన ఘటనను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కల్తీ పాల తయారీదారులకు కఠినమైన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతేకాకుండా, పాలలో కల్తీ చేసే వారికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆయన కోరారు. బాధిత కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని, వారికి ప్రభుత్వ మద్దతు అత్యవసరమని పేర్కొన్నారు.

ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పాల సరఫరా వ్యవస్థపై నిరంతర తనిఖీలు చేపట్టాలని, సేకరించిన నమూనాలను ల్యాబ్‌లకు పంపించి నాణ్యతను పరీక్షించాలని సూచించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తేనే కల్తీ పాల దందాను పూర్తిగా అరికట్టగలమని ఆయన స్పష్టం చేశారు.

Comments

-Advertisement-