రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

- విద్యార్థుల పఠన సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి

- తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలు చదివించి పరీక్ష

- వెనుకబడితే చర్యలు తప్పవని హెచ్చరిక

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 18 (పీపుల్స్ మోటివేషన్): టేకులపల్లి మండలం కోయగూడెం ప్రాథమిక బాలుర ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా పరిస్థితులను పరిశీలిస్తూ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వారికి అందుతున్న మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను తెలుగు మరియు ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలు చదివించాలని చెప్పి వారి పఠన సామర్థ్యాన్ని పరీక్షించారు. చదవడంలో కొంతమంది విద్యార్థులు వెనుకబడి ఉన్నారని గమనించిన కలెక్టర్ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. చదవడంలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు పఠన సామర్థ్యమే పునాది అని కలెక్టర్ స్పష్టం చేశారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. సూచనలు అమలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Comments

-Advertisement-