రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ముంబై స్లమ్స్‌లో ‘రౌడీ జనార్ధన’ హడావిడి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ముంబై స్లమ్స్‌లో ‘రౌడీ జనార్ధన’ హడావిడి

హైదరాబాద్, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్):

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో రౌడీ జనార్ధన ఒకటి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ముంబై స్లమ్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవబోతుందట. రియలిస్టిక్‌గా, ఇంటెన్స్‌గా ఉండేలా ఈ ఫైట్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో విజయ్ పాత్ర పేరు జనార్ధన్ కాగా, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ లుక్, ట్రాన్స్‌ఫార్మేషన్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ఇక ‘రౌడీ’ అనే ట్యాగ్‌తో ఇప్పటికే అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన విజయ్, ఇప్పుడు అదే ఇమేజ్‌కు సరిపోయే టైటిల్‌తో వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ సినిమాతో విజయ్ తన మాస్ అవతార్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Comments

-Advertisement-