రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బోయినపల్లి మార్కెట్ దుస్థితిపై ఈటెల రాజేందర్ ఆగ్రహం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

బోయినపల్లి మార్కెట్ దుస్థితిపై ఈటెల రాజేందర్ ఆగ్రహం

- శాశ్వత పరిష్కారం వరకు ధర్నా హెచ్చరిక

- చెత్తతో నిండిన మార్కెట్ యార్డ్‌పై తీవ్ర విమర్శలు

- కాంట్రాక్టర్లకు చెల్లింపులేక పనులు నిలిచిపోయిన పరిస్థితి

- సమస్య పరిష్కారం వరకు ఉద్యమం కొనసాగిస్తానని స్పష్టం

హైదరాబాద్, మార్చి 28 (పీపుల్స్ మోటివేషన్): మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ బోయినపల్లి వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించి అక్కడి రైతులు, కార్మికులు, వ్యాపారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ దుస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఆదర్శంగా నిలిచిన ఈ మార్కెట్ ప్రస్తుతం చెత్తతో నిండిన డంప్ యార్డ్‌లా మారిందని ఆరోపించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

సుమారు 24 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మార్కెట్‌కు రోజుకు దాదాపు 10 వేల మంది కస్టమర్లు వస్తారని, సంవత్సరానికి 14 నుంచి 15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ప్రాధాన్యత కలిగిన కేంద్రం అని పేర్కొన్నారు. అయితే గత 9 నెలలుగా చెత్త తరలింపు కాంట్రాక్టర్లు, శుభ్రత కార్మికులకు చెల్లింపులు చేయకపోవడం వల్ల వందల లారీల చెత్త పేరుకుపోయిందని తెలిపారు. కుళ్లిపోయిన కూరగాయల వల్ల దుర్గంధం వ్యాపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మార్కెట్‌లో పరిశుభ్రత పూర్తిగా దెబ్బతిందని, మురుగునీరు కాళ్ల కిందకి వచ్చి పుండు పుట్టించే స్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల కారణంగా కస్టమర్లు రావడం తగ్గి వ్యాపారం దెబ్బతింటోందని పేర్కొన్నారు. మంత్రులు, కమిషనర్‌కు పలుమార్లు తెలియజేసినా సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు.

మహిళల కోసం ఉన్న టాయిలెట్ సదుపాయాలు అత్యంత దారుణంగా ఉన్నాయని తెలిపారు. నీరు లేకపోవడం, తలుపులు లేకపోవడం వంటి సమస్యలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని, నీటి ట్యాంకులు ఉన్నా నీరు అందుబాటులో లేదని వివరించారు. ఆరోగ్యకరమైన మార్కెట్‌గా ఉండాల్సిన ప్రదేశం రోగాల కేంద్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెత్త పూర్తిగా తొలగించడం, డ్రైనేజీ శుభ్రపరచడం, మంచినీటి సరఫరా మెరుగుపరచడం, బయోగ్యాస్ ప్లాంట్ పునరుద్ధరణ వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ధర్నా కొనసాగిస్తానని హెచ్చరించారు. అవసరమైతే మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేసి పూర్తిగా శుభ్రం చేయాలని సూచించారు. ప్రభుత్వంపై కూడా ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. భారీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రాథమిక సదుపాయాలపై నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులను పంపించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే వేలాది కార్మికులతో కలిసి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు.

Comments

-Advertisement-