రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

- అర్హులకు రూ.20 వేల ఆర్థిక సహాయం

- పంచాయతీ కార్యదర్శి, ఎంపిడిఓ కార్యాలయాల్లో దరఖాస్తు అవకాశం

- బీపీఎల్ కుటుంబాలకు ప్రయోజనం కలిగే పథకం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

పెద్దపల్లి, మార్చి 4 (పీపుల్స్ మోటివేషన్):
జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులైన వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. ఈ పథకానికి అర్హులైన వారు పంచాయతీ కార్యదర్శి కార్యాలయం, ఎంపిడిఓ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. బీపీఎల్ కుటుంబాలలో కుటుంబాన్ని పోషించే ప్రధాన వ్యక్తి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండి మరణించినట్లయితే ఆ కుటుంబానికి ఈ పథకం కింద రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. అయితే మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇతర ఆర్థిక సహాయం అందకపోయినప్పుడు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.

Comments

-Advertisement-