రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా

  • హైకమాండ్, సీఎం తీరుపై తీవ్ర విమర్శలు
  • ఫిరాయింపుల ప్రోత్సాహంపై అసంతృప్తి వ్యక్తం
  • బుజ్జగింపులు ఫలించకపోవడంతో నిర్ణయానికి కట్టుబాటు

జగిత్యాల, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని జీవన్ రెడ్డి వెల్లడించారు. గౌరవం లేని చోట కొనసాగడం సాధ్యం కాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ లోపల తనకు సరైన ప్రాధాన్యత లభించలేదని, తన భావాలను పట్టించుకోలేదని ఆరోపించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించడం పార్టీ విధానాలకు విరుద్ధమని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను పార్టీలోకి తీసుకోవడం, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను పక్కన పెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాముఖ్యత ఇస్తున్నారని విమర్శించారు. తనకు అండగా ఉన్న కీలక నాయకుడు మరణించిన సమయంలో ముఖ్యమంత్రి పరామర్శించలేదని, తనకు మద్దతుగా నిలబడలేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ కారణాల వల్లే పార్టీపై నమ్మకం కోల్పోయానని, ఇకపై రేవంత్ రెడ్డి విధానాలపైనే తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మరోవైపు, జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చివరి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జీవన్ రెడ్డి తన నిర్ణయానికే కట్టుబడి ఉండగా, జగిత్యాల నియోజకవర్గంలో ఆయనకు ఉన్న బలమైన కేడర్ ఇప్పుడు ఆయన వెంట నడిచే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Comments

-Advertisement-