రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

  • 13 మంది సజీవ దహనం 
  • రాష్ట్రాన్ని కలచివేసిన ఘటన
  • బస్సు-టిప్పర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు
  • గాయపడిన వారి పరిస్థితి విషమం 

మార్కాపురం, మార్చి 26 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ప్రైవేట్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్ నుంచి పామూరుకు సుమారు 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావం తీవ్రంగా ఉండటంతో బస్సు పూర్తిగా దెబ్బతింది.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ప్రమాదం తర్వాత బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటలు క్షణాల్లోనే బస్సు, టిప్పర్‌ను చుట్టుముట్టాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ప్రమాదాన్ని ముందుగానే గుర్తించలేకపోయారు. కొందరు అప్రమత్తమై బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే 10 మంది మాత్రం మంటల్లో చిక్కుకుని బయటపడలేక సజీవ దహనమయ్యారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని తక్షణమే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ వైద్యులు తీవ్రంగా గాయపడిన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారి గుర్తింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Comments

-Advertisement-