రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఖమ్మం కూల్చివేతలపై పినరయి విజయన్ విమర్శలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఖమ్మం కూల్చివేతలపై పినరయి విజయన్ విమర్శలు

  • “తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది”
  • 700 ఇళ్ల కూల్చివేత, 3 వేల మంది నిరాశ్రయులయ్యారని ఆరోపణ
  • అణగారిన వర్గాలపై దాడులకు సమాధానం చెప్పాలన్న డిమాండ్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

తిరువనంతపురం/ఖమ్మం, మార్చి 2 (పీపుల్స్ మోటివేషన్):
ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్ల కూల్చివేతల అంశంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో “బుల్డోజర్ రాజ్యం” నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం 700 ఇళ్లను కూల్చివేసి సుమారు 3,000 మందిని నిరాశ్రయులను చేసిందని ఆరోపించారు. బీజేపీ అమలు చేస్తున్న బుల్డోజర్ విధానాన్ని తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తోందని ఆయన పేర్కొన్నారు. అణగారిన వర్గాలపై జరుగుతున్న చర్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని, ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమని అన్నారు.

తెలంగాణలో అణగారిన వర్గాల ఇండ్లను కూల్చి, మరోవైపు కేరళలో ప్రజలతో నిలబడతామని చెప్పడం అవమానకరమని పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చతెస్తాయని అన్నారు. పేదల పునరావాసంపై స్పష్టత ఇవ్వాలని ఆయన సూచించారు.

Comments

-Advertisement-