గీత కార్మికుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
గీత కార్మికుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
- కార్మికుల నేతలతో సమావేశం
- బాధిత కుటుంబానికి రూ.4 లక్షల సాయం మంజూరు
- ఉపాధి అవకాశాలపై పలు ప్రతిపాదనలు
విజయనగరం, 9 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
గీత కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవిని ఉత్తరాంధ్ర గీత కార్మికుల సంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అసెంబ్లీలో గీత కార్మికుల కష్టాలను ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు నాయకులు ఎమ్మెల్యేను అభినందించారు.
అసెంబ్లీలో ఆమె చొరవతో గీత కార్మికుడి కుటుంబానికి తక్షణమే రూ.4 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయించామని తెలిపారు. ప్రమాదాలకు గురయ్యే గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా నీరా తయారీ యూనిట్ల ఏర్పాటు అంశంపై కూడా చర్చించారు. నీరా ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా గీత కార్మికులకు స్థిరమైన జీవనోపాధి కల్పించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై సంబంధిత మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు ఆమె వెల్లడించారు. తీర ప్రాంతాల్లో గోవా తరహాలో చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసి గీత కార్మికులు తమ ఉత్పత్తులైన కల్లు, ముంజులు, తాటి బెల్లం వంటి ఉత్పత్తులను విక్రయించుకునేలా కొత్త ఉపాధి అవకాశాలను అన్వేషిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చెట్లపై పని చేసే సమయంలో ప్రమాదాలు జరిగితే గీత కార్మికులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన భీమా మొత్తాన్ని త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గీత కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలపై ప్రత్యేకంగా ఒక నివేదిక సిద్ధం చేసి సంబంధిత మంత్రులు మరియు ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి స్పష్టం చేశారు.
Comments
