రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సివిల్స్ ఫలితాలు విడుదల

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

సివిల్స్ ఫలితాలు విడుదల

- ఆల్ ఇండియా టాపర్‌గా అనుజ్ అగ్నిహోత్రి

- మొత్తం 958 మందికి ఎంపిక

- తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల ప్రతిభ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

న్యూఢిల్లీ, మార్చి 6 (పీపుల్స్ మోటివేషన్):
దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష-2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సహా వివిధ కేంద్ర సేవల కోసం మొత్తం 958 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఈ ఫలితాల్లో అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించి టాపర్‌గా నిలిచారు. రాజేశ్వరి సువే రెండో ర్యాంకు, అకన్ష్ ధుల్ మూడో ర్యాంకు సాధించారు. ఈసారి ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా తమ ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 30 మందికి పైగా తెలుగు అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌లో విజయాన్ని సాధించడం విశేషం. ఆల్ ఇండియా 23వ ర్యాంకుతో జీను శ్రీ జస్వంత్ చంద్ర, 55వ ర్యాంకుతో పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. వీరిద్దరూ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇతర తెలుగు అభ్యర్థుల్లో పోలవరపు ధ్వనీష్ 108వ ర్యాంకు, అట్ల తరుణ్ తేజ 123వ ర్యాంకు, శ్రీగిరిరాజు వి.పి.ఎస్. సాయి కృష్ణ 125వ ర్యాంకు, కొలిపాక శ్రీకృష్ణ సాయి 150వ ర్యాంకు, బానోత్ లక్ష్మి రచన 178వ ర్యాంకు సాధించారు. ఎస్. వర్షిత్ రెడ్డి 259వ ర్యాంకు, మాసమ్మగారి పవన్ కుమార్ రెడ్డి 297వ ర్యాంకుతో మెరుగైన ఫలితాలు సాధించారు. అదేవిధంగా వెలిమినేటి విక్రమ్ సింహా రెడ్డి 541వ ర్యాంకు, గుమ్మల శ్వేత 573వ ర్యాంకు, వెలిమినేటి విజయసింహ రెడ్డి 682వ ర్యాంకు, పుడారి రాహుల్ 748వ ర్యాంకు, కత్తిమాని అనిరుధ్ 786వ ర్యాంకు, కొరపోతుల శ్రీకర్ రాజు 806వ ర్యాంకు, ఇస్లావత్ శ్రీరామ్ హర్ష 823వ ర్యాంకు, కట్టా ప్రత్యూష 908వ ర్యాంకు, రాజశేఖర్ గోగుల 920వ ర్యాంకు, గుగోలత్ జితేందర్ నాయక్ 939వ ర్యాంకులతో విజయాన్ని సాధించారు. లక్షలాది మంది పోటీపడే ఈ పరీక్షలో తెలుగు యువత మంచి ప్రతిభ కనబర్చడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి ఫలితాల జాబితాను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Comments

-Advertisement-