రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు పెంపు యోచన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు పెంపు యోచన

  • 60 నుంచి 62 ఏళ్లకు పెంపుపై సానుకూల నిర్ణయం
  • సబ్ కమిటీ కీలక సిఫారసులు
  • 8,500 మందికి లబ్ధి అవకాశం

మార్చి 21 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. వీరి పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, పురపాలక శాఖ మంత్రి నారాయణలతో కూడిన కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,500 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు చాలా కాలంగా ఈ డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. గతంలో ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోకపోయినా, ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర అధ్యయనం చేపట్టింది. రిటైర్మెంట్ వయసు పెంపు వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం, పరిపాలనా ప్రభావం వంటి అంశాలను కమిటీ సమగ్రంగా పరిశీలించింది. ఉద్యోగుల అనుభవాన్ని కొనసాగించడం, పరిపాలనా స్థిరత్వం వంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అన్ని కోణాల్లో విశ్లేషణ అనంతరం నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలైతే ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు.

Comments

-Advertisement-