ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, భోజనంపై ఎమ్మెల్యే పర్యవేక్షణ
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, భోజనంపై ఎమ్మెల్యే పర్యవేక్షణ
- పనపాకం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంపై తనిఖీ
- విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే
- అంగన్వాడి కేంద్రాన్ని కూడా పరిశీలన
చంద్రగిరి, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. చంద్రగిరి మండలం పనపాకం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అమలు అవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. రోజువారీ మెనూ ప్రకారం ఆహారం వడ్డిస్తున్నారా లేదా అన్న విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచిగా, శుభ్రంగా ఉందని విద్యార్థులు చెప్పడంతో ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యతో పాటు పోషకాహారం కూడా సమానంగా అవసరమని ఆయన తెలిపారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం తాను తిన్న ప్లేటును స్వయంగా కడిగి సాధారణతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆహార నాణ్యత, వంటశాల పరిశుభ్రత, ఉపాధ్యాయుల బోధనా విధానంపై కూడా ఆయన ఆరా తీశారు. పాఠశాల నిర్వహణపై సంబంధిత సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం సమీపంలోని అంగన్వాడి కేంద్రాన్ని కూడా ఎమ్మెల్యే తనిఖీ చేశారు. అక్కడ హాజరు పట్టికను పరిశీలించి, పిల్లలకు అందిస్తున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారుల పోషణ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆయన సూచించారు. అధికారులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశించారు.
Comments
