రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సంగారెడ్డిలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

సంగారెడ్డిలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు

- రాష్ట్రంలో వైద్య సేవల మెరుగుదలకు కొత్త వ్యవస్థ

- 64 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు

- ప్రాజెక్టు అమలుపై ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం

సంగారెడ్డి, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన, అమలు పై రాష్ట్ర మరియు జిల్లా స్థాయి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమన్వయ సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు అమలు విధానం, ముందస్తు ఏర్పాట్లు, అవసరమైన సాంకేతిక సదుపాయాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని మొత్తం 64 ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు పొందేందుకు వచ్చే ప్రతి రోగికి సంబంధించిన పూర్తి ఆరోగ్య వివరాలతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించి డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయనున్నారు. ఇందులో ఒక ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి, నాలుగు ఏరియా ఆసుపత్రులు, ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, నాలుగు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 31 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 19 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. రోగి ఆసుపత్రికి వచ్చిన మొదటి దశ నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ఓపీ, వైద్య అధికారి, ప్రయోగశాల, ఔషధశాల వంటి అన్ని విభాగాల్లో రోగి వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో నమోదు చేసే విధంగా ఐటీ సదుపాయాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యకు ఆదేశించారు. డిజిటల్ హెల్త్ కార్డు ద్వారా రోగి పూర్తి వైద్య చరిత్ర డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండటం వల్ల వైద్యులు త్వరితగతిన సరైన చికిత్స అందించగలరని మంత్రి తెలిపారు. అలాగే గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఇతర సంక్రమణ మరియు అసంక్రమణ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైన చికిత్స అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో ఉదయ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యతో పాటు రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్న ఈ పైలెట్ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డు అమలుకు ఆదర్శంగా నిలవాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

-Advertisement-