రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సంతోష్‌నగర్ స్టీల్ బ్రిడ్జి పనుల్లో భద్రతా లోపాలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

సంతోష్‌నగర్ స్టీల్ బ్రిడ్జి పనుల్లో భద్రతా లోపాలు

  • గిర్డర్ల అమరికలో నిర్లక్ష్యం ఆరోపణలు
  • వాహన రాకపోకల నియంత్రణ లేక ప్రజల ఆగ్రహం
  • ప్రమాదానికి దారితీసే పరిస్థితులపై ఆందోళన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, మార్చి 2 (పీపుల్స్ మోటివేషన్):
సంతోష్‌నగర్–చంచల్‌గూడ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ ఐరన్ గిర్డర్లను క్రేన్ల సాయంతో అమర్చుతున్న సమయంలో కిందుగా వాహనాల రాకపోకలు కొనసాగడం ప్రమాదానికి దారితీసే పరిస్థితులను సృష్టిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో తగిన హెచ్చరిక బోర్డులు, భద్రతా తాడులు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు కనిపించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారీ గిర్డర్లు ఎత్తి అమర్చే సమయంలో కింద వాహనాలు వెళ్లడం వల్ల ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశముందని చెబుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేసి లేదా మళ్లించి పనులు చేపట్టాల్సిందని వారు సూచిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పనులు పూర్తయ్యే వరకు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.

Comments

-Advertisement-