రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Womens Day:మహిళా ఆరోగ్యం - సామాజిక వికాసమే లక్ష్యం

Womens day BJP news BJP news kurnool BJP WOMENS DAY CELEBRATION S intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Peoples Motivation

Womens Day:మహిళా ఆరోగ్యం - సామాజిక వికాసమే లక్ష్యం

-బిజెపి మహిళా మోర్చా

- నగరంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

- ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ

Womens day BJP news BJP news kurnool BJP WOMENS DAY CELEBRATION S intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news Venkata sujatha news bjp sujatha news
కర్నూలు, (పీపుల్స్ మోటివేషన్):-

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని హీరయిన్ రెసిడెన్సీలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎ. వెంకట సుజాత సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమం మహిళల చైతన్యానికి వేదికగా నిలిచింది.

ఈ సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా నేచురోపతి, ఆయుర్వేదం మరియు గృహ వైద్యం అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ చెకప్ శిబిరంలో బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన నగర ప్రముఖులు మహిళా సాధికారతపై తమ విలువైన సలహాలు, సూచనలు అందించారు. బిజెపి జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుజాత మొదటిసారిగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో జిల్లా మరియు రాష్ట్ర స్థాయి బిజెపి నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Comments

-Advertisement-