రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బాలల హక్కుల పరిరక్షణ బృహత్తరమైన బాధ్యత

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

బాలల హక్కుల పరిరక్షణ బృహత్తరమైన బాధ్యత 

బాలల ఆరోగ్యం, విద్య, వికాసం కోసం పాటుపడండి

ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు 


బాలల హక్కుల పరిరక్షణ ఒక బృహత్తరమైన బాధ్యత అని, నిస్వార్ధంగా పిల్లల హక్కుల పరిరక్షణ, ఆరోగ్యం, విద్య, వికాసం కోసం పాటుపడాలని ముఖ్యమంత్రి నూతన కమిషన్‌కు దిశా నిర్దేశం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా ఎంపికైన కమిషన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని సెక్రటేరియట్‌లో కలిసింది. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణకు కమిషన్ చేస్తున్న కృషికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం భరోసా ఇచ్చారని చైర్ పర్సన్ తెలిపారు. కమిషన్ సభ్యులను ఆత్మీయంగా పలకరించిన ముఖ్యమంత్రి .. నిస్వార్ధంగా బాలల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషిచేసి సమాజానికి ఉత్తమ పౌరులను అందించేలా కమిషన్ పనిచేయాలని ఆకాంక్షించారు. సీఎంను కలిసిన వారిలో కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీబాబు, పద్మలత, డాక్టర్ నాగ మానస, డాక్టర్ శ్రీనివాసమూర్తి, మందాల గంగ సూర్యనారాయణ, చల్ల మధుసూదన రావు ఉన్నారు.

Comments

-Advertisement-