రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

భారతదేశ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి..103 జయంతి.. సందర్భంగా

Damodaram Sanjivayya CM of Andhra Pradesh, Dalit CM of AP, Kurnool news, Ap news, political news, Cms news,
Peoples Motivation

భారతదేశ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి
దామోదరం సంజీవయ్య 103వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం

కుల రాజకీయాలకు బలైపోయిన మహోన్నతమైన నాయకుడు దామోదరం సంజీవయ్య ఫిబ్రవరి 14, 1921, కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, పెద్దపాడు గ్రామంలో మునిదాసు, సుంకలమ్మ కి, "మాల" కుటుంబంలో జన్మించారు.. తాను పుట్టిన మూడు రోజుల్లోనే తండ్రిని కోల్పోయినా,, కష్టపడి చదువు కొనసాగించిన ఆయన ఆరోజుల్లోనే మద్రాస్ లా కాలేజీ నుండి,,  న్యాయశాఖ విభాగం నుండి లా డిగ్రీ పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో నిలిచారు. సంయుక్త మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అటు కేంద్ర ప్రభుత్వంలో అనేకమార్లు మంత్రి పదవిని నిర్వహించారు. అదేవిధంగా రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అవడం కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒక చరిత్ర. ఈయన కాంగ్రెస్ పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా కేవలం 38 సంవత్సరాల అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత చరిత్ర పుట్టలలో ఆయనకే దక్కింది.

Damodaram Sanjivayya

      ఆమహానుభావుడు  గురించి చెప్పాలి అంటే,, ఆయన స్నేహితుల మాటలు ఇక్కడ చర్చించుకోవాలి సమాజాన్ని కూడా తెలియపరచాలి. ఆయన పెద్దపాడు నుండి కర్నూలు మునిసిపల్ బడికి చిరిగి పోయిన బట్టలు వేసుకుని,, 8 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రతిరోజు స్కూలుకు పోయి  రోజూ జొన్న రొట్టెలో కారం వేసుకుని నా వెంట సంచిలో తెచ్చుకొని తినేవారని చాలామంది కర్నూలు పట్టణమునందు ఉన్న పెద్దలు చెప్పే విషయాలు విన్నాము. అలాంటి దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అవుతాడని  ఎవరు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ఆయన అమోఘమైనటువంటి జ్ఞాన సంపన్నుడు ఆయన జ్ఞానాన్ని గుర్తించినటువంటి వారు జవహర్లాల్ నెహ్రూ ఆయన నిజాయితీ ,నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన ఆయన కష్టమే దామోదర్ దామోదర సంజీవయ్య ని ఆ స్థానంలో  నిలబెట్టింది. ఆయన మద్రాసులోని లా కాలేజీలో లా చదివే రోజుల్లో ప్రతినెల మెస్ చార్జీలు చెల్లించుట కోసం  ఆయన గణిత ఉపాధ్యాయిడిగా పని చేస్తూ ఇక్కడ విద్యార్థులకు ట్యూషన్లు చెపుతూ కష్టపడి చదువుకున్నారు. ఆ మహా మనిషి జీవితంలో

అపజయం ఎరుగని రాజకీయ దురంధరుడు . ఆ సమయంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్రాస్ లో లా కాలేజీలో చదివే రోజుల్లోనే  స్వతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొని, నెహ్రు లాంటి అనేకమంది జాతీయ నాయకుల దృష్టిని  ఆకర్షించిన  అపర జ్ఞానవంతుడు ఆదామోదరం సంజీవయ్య... అనర్గళంగా మేధావులను ప్రజలను అర్రుతలు ఊగించేలా ఇంగ్లీషులో  ప్రసంగించేవారు, అలాంటి గొప్ప వ్యక్తి నెహ్రు చేత. సంజీవయ్య సార్  అని  పిలిపించుకున్నాడు. ఒక తిరుగులేని రాజకీయ నాయకుడిగా, వ్యూహకర్తగా దేశంలో గొప్ప మన్ననలు అందుకున్న సంజీవయ్య, అతి చిన్న వయసులో కాంగ్రెస్ నాయకులుగా ఎన్నో రికార్డులు  చరిత్ర సృష్టించి గొప్ప సంస్కరణలు  తీసుకోవచ్చారు, విజయాలు సాధించారు.. అందులో కొన్ని.29 సంవత్సరాల వయసులో మొదటిసారిగా ఎమ్మెల్యే గా ఎన్నిక అయ్యారు.అప్పట్లో అదొక పెద్ద రికార్డుగా నమోదయింది. 31 సంవత్సరాల వయసులో ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వంలో, సి.రాజగోపాలచారి కాబినెట్ లో మంత్రిగా ఎన్నిక అయ్యారు.అదొక చారిత్రాత్మకం

Damodaram Sanjivayya

38 సంవత్సరాల వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా,, దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా, అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని పొందిన రాజకీయ నేతగా పేరు ప్రతిష్టలు దక్కించుకున్నారు.ఒంటిచేత్తో 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించిన సంజీవయ్య అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నిక అయ్యి కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అందులో భాగంగానే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన మొదటి దళితుడి కూడా ఆయన సొంతం.1964 సంవత్సరంలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సంజీవయ్య, కొంతకాలం కేంద్ర ప్రభుత్వంలోని జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా, అదేవిధంగా మరికొంతకాలం వాణిజ్య శాఖ మంత్రిగా,తర్వాత ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో మరోసారి ఇందిరా గాంధి ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, ఎన్నికై, కార్మిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు..

 సంజీవయ్య తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు చేస్తూ ఎన్నో కార్యక్రమాలను భావితరాలకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధత కల్పించారు.ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యాక సంజీవయ్య మొదటిసారి తన తల్లి సుంకలమ్మని కలవడానికి వెళ్ళినప్పుడు, అక్కడ నుండి తిరిగి పోతూ ఒక 100 రూపాయలు తల్లి చేతిలో  పెట్టారు.ఆ తల్లి 100 తీసుకుంటూ నాకంటే నువ్వు ఉన్నావు, మరి నాలాంటి ఎంతో మంది పేదలకు సహాయం చేయడానికి ఎవరు ఉన్నారు అని ప్రశ్నించింది.. ఆవిడ ప్రశ్న సంజీవయ్య మనసుని ఆలోచింపజేసింది.ఆ ఆలోచన నుండి పుట్టినదే. వృద్ధాప్య పింఛను. దీనిని ప్రభుత్వాలు ఆనాటి నుండి నేటి వరకు కూడా దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ఆయన పేదల కోసం, బడుగు బలహీన వర్గాలకోసం, కార్మికుల కోసం, తీసుకొచ్చిన పథకాలు భారతదేశ వ్యాప్తంగా రాజకీయాలనే ప్రభావితం చేశాయి.వాటిలో కొన్ని

దేశంలో మొట్టమొదటి వృధాప్య పింఛన్ల పథకం,

దేశంలో మొట్టమొదటి వితంతు పింఛన్ల పధకం,

1960 సంవత్సరంలో దళితులకు రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎకరాల ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు.ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు 14% శాతము నుండి 17 % శాతము పెంచడం, BC రిజర్వేషన్లు 24% నుండి 38% పెంచి, కాపులకు రిజర్వేషన్లు కల్పించడం.తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ చట్టాలను తొలగించాయి.1961 లో దేశంలోనే మొట్టమొదటిసారి,, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ,ఎస్టీ, బీసీ, లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత పెంచడానికి కారణం అయిన, నిర్బంధ ప్రాథమిక విద్య,, ఉన్నత చదువుల్లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు,, మధ్యాహ్న భోజన పధకం లాంటి కార్యక్రమాలను నిర్వహించారు.

1965లో కార్మిక శాఖ మంత్రిగా ఎన్నికయ్యాక, కార్మికులకు బోనస్ ఇచ్చేవిధంగా చట్టం తీసుకోవచ్చారు.కాంట్రాక్ట్ ఉద్యోగుల రక్షణ కోసం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం 1970 తెచ్చారు,కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం, ఇప్పుడు ఎంతో మంది కార్మికులకు బాసటగా నిలుస్తున్న ESI వ్యవస్థను రూపొందించారు. వీటితో పాటు పాలన వ్యవస్థలో గణనీయమైన మార్పులు పరిచయం చేసారు సంజీవయ్య గారు.వాటిలో కొన్ని ముఖ్యమైనవి అందులో అవినీతి నిరోధక శాఖ, యాంటీ కరప్షన్ బ్యూరో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు నెలకొల్పారు.ఆంధ్రప్రదేశ్ లో మొదటి ల్యాండ్ సర్వే చేపట్టారు అదేవిధంగా గ్రేటర్ హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు.మొదటి లా కమీషన్ ఏర్పాటు చేశారు. నీటి ప్రాజెక్టులను పరిశీలించినట్లయితే అందులో

గాజులదీన్నే, వరదరాజుల స్వామి నీటి ప్రాజెక్టులతో రాయలసీమ కి సాగునీరు అందించడం జరిగినది. పులిచింతల,వంశధార ప్రాజక్టుల నిర్మాణంనకు నాంది పలికారు.కళాకారుల కోసం లలిత కళా అకాడెమీ స్థాపన  అనేది దేశంలోనే మొట్టమొదటిది.తెలుగుని రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించడం, ఉర్దూని రెండవ అధికారిక భాషగా ప్రకటించడం. సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకొని చేశారు.

నీతికి నిజాయితీకి మారుపేరు నిస్వార్థమైన త్యాగజీవి మరుపురాని మహోన్నతుడు సంజీవయ్య.

రాజకీయంగా అంతటి ఉన్నత పదవులు అనుభవించినా, ఒక పేదవాడిగా సాధారణ మనిషిగా చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారు సంజీవయ్య. సంతానము కలిగితే స్వార్థం పెరుగుతుందని ఉద్దేశంతో పిల్లలు ఉంటే వాళ్ళ కోసం సంపద పోగేసే ఆలోచన వస్తుందేమో అని భార్య కృష్ణవేణమ్మని ఒప్పించి సంతానము కలగకుండా జీవితం గడిపారు సంజీవయ్య. 1967 వ సంవత్సరంలో  ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైన సంజీవయ్య. తర్వాతి క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై, 8వ తేదీన 1972 వ సంవత్సరంలో తుదిశ్వాస విడిచారు. అదే రోజు వారి వివాహ వార్షికోత్సవం కావడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం.చనిపోయే సమయానికి ఆయనకు మిగిలిన ఆస్తులు  పెదపాడు గ్రామంలో ఒక రేకుల కప్పు ఇల్లు,తన హాఫ్ చేతుల కోటు వాటిని దాచుకోవడానికి ఒక రేకు పెట్టె, మరియు భోజనం చేయడానికి ఒక ఇత్తడి పాత్ర, కొన్ని పుస్తకాలు. మిగిలి ఉన్నాయి., ఇది ఆయన సంపద ఆ మహోన్నతుడు ఎంతో వెలకట్టలేని విలువలతో జీవించినటువంటి మహానుభావుడు దామోదరం సంజీవయ్య.

దామోదరం సంజీవయ్య సేవలు విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం 

 దామోదరం సంజీవయ్య చనిపోయాక వారికి వారసులు ఎవరూ లేకపోవడంతో, ఆయన ఇంటిని అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ సి.హెచ్ విజయ మోహన్ స్వాధీనం చేసుకున్నారు. అప్పటి ప్రభుత్వం ఆ ఇంటిని మ్యూజియంగా మారుస్తామని గొప్పగా పత్రిక ప్రకటనలు ఇచ్చారు. మాట ఇచ్చి మరచ్చిపోయిన యంత్రాంగం ప్రభుత్వాలు,అది నేటికీ ఆచరణలో జరగలేదు. చివరకు ఆ కలెక్టర్ కూడా హార్ట్ ఎటాక్ తో అకాల మరణం కూడా చెందారు. మళ్ళి ఎన్నికలప్పుడు అభ్యర్థులు ఆఇంటి స్థలంలో కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేస్తాము అని మాటలు చెప్పడమే తప్ప ఆచరణలోకి రాలేదు.ఆయన నివాసం నేటికీ శిథిలావస్థలోనే ఉండిపోయింది. ఒకానొక సందర్భంలో రాహుల్ గాంధీ గారు కూడా ఆ ఇంటిని సందర్శించి వారి వారసులను కలవడం జరిగింది. హుస్సేన్ సాగర్ పక్కన సంజీవయ్య సమాధిని ఏర్పాటు చేసి ఆస్థలాన్ని "సంజీవయ్య పార్కగా" పేరుతో నామకరణం ఏర్పాటై చేసినప్పటికీ,అది కూడా రక్షణకు నోచుకోక, అక్కడ నిత్యం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మార్పులు చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి. మరొక విషయం ఏమిటంటే భారత ప్రభుత్వం 2008 సంవత్సరంలో ఫిబ్రవరి 14 న, సంజీవయ్య జయంతి సందర్భంగా, ఆయన ఫోటోతో ఒక పోస్టల్ స్టాంప్ ను గౌరవ సూచికంగా విడుదల చేసింది.దళిత వర్గాల నుండి వచ్చిన నాయకుల పట్ల ప్రభుత్వాల అలసత్వం, నిర్లక్ష్యం ,లెక్కలేని తనం అయ్యింది. కానీ ఇలాంటి గొప్ప విజయాలు సాధించిన శిఖరం, మనసున్న మానవతావాది, ప్రజల పట్ల ప్రేమ కలిగిన నాయకుడు, స్ఫూర్తి ప్రధాత, పేద వర్గాలకు, కులాలకు మతాలకు అతీతంగా, మరియు  దళిత జాతికి అత్యధికంగా నిస్వార్థంగా సేవలు అందించడమే కాకుండా.నిస్వార్థంగా నిజాయితీగా బ్రతికిన త్యాగమూర్తి దామోదరం సంజీవయ్యని కనీసం దళిత జాతులు కూడా గుర్తుంచుకొని గౌరవించుకో కపోవడం చాలా దారుణం ఎందుకంటే మనం సంజీవయ్యని అధ్యయనం చేయాలి అదేవిధంగా నంద్యాల జిల్లాలో ప్రధాన కూడలిలో దామోదరం సంజీవయ్య విగ్రహము, మరియు మాన్య శ్రీ కాన్సిరాం విగ్రహాలను జిల్లా అధికారులు ఏర్పాటు చేయుటకు చర్యలు చేపడతారని ఆశిద్దాం..✍️✍️

డా.జి.బాలస్వామి

న్యాయవాది.మరియు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

వ్యవస్థాపక అధ్యక్షుడు పూలే అంబేడ్కర్ జ్ఞాన కేంద్రం

Comments

-Advertisement-