ఇండియన్ సొసైటీ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ 64వ వార్షిక కాన్ఫరెన్స్ కు బండారి ధనుంజయ ఎంపిక..
ఇండియన్ సొసైటీ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ 64వ వార్షిక కాన్ఫరెన్స్ కు బండారి ధనుంజయ ఎంపిక.
దేవనకొండ, ఫిబ్రవరి 14 (పీపుల్స్ మోటివేషన్):-
కడపలోని యోగివేమన యూనివర్సిటీ నందు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ విభాగం నుంచి పొట్లపాడు గ్రామానికి చెందిన బండారు ధనుంజయను ఎంపిక చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన బండారి ధనుంజయ కడపలోని యోగి వేమన యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ విభాగంలో తమ గురువు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసులు బైనేని దగ్గర భారత దేశంలోని "గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పెరుగుదల" అనే అంశంపై పిహెచ్డి (పరిశోధన) చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే 2024 మార్చి 29 నుంచి 31 వరకు హైదరాబాదులోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ (ఐఎస్ఎల్ఈ) 64వ వార్షిక కాన్ఫరెన్స్ జరగనుందని తెలిపారు.
ఈ కాన్ఫరెన్స్ లో దేశ, విదేశాల నుంచి ప్రొఫెసర్లు, ఎకనామిస్టులు,మేధావులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ లో బండారి ధనుంజయ "భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాల పెరుగుదల" అనే అంశంపై ఉపన్యాసిస్తారని తెలిపారు. ఈ సమావేశానికి కడపలోని వైవియూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ విభాగం నుండి తనను ఎంపిక చేయడం గర్వించదగ్గ విషయమని బండారి ధనుంజయ తెలిపారు. తనకు సహకరిస్తున్న తన గురువు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసులు బైనేనికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.