పారిశుధ్యం, పరిశుభ్రత ఎక్కడ?
పారిశుధ్యం, పరిశుభ్రత ఎక్కడ?
-మురికి కూపంగా మారిన వార్డులు పట్టణం
-నిద్రపోతున్న అధికార యంత్రాంగం
-అధికార పక్ష కౌన్సిలర్ కే దిక్కు, దివానం లేని వైనం -గోళ్ల రాజేష్
నంద్యాల (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాలలో పారిశుధ్యం, పరిశుభ్రత ఎక్కడ అని, మురికి కూపంగా మారిన వార్డులు, నంద్యాల పట్టణమని, అధికార యంత్రాంగం నిద్రపోతున్నదని, అధికారపక్ష కౌన్సిలర్ కే దిక్కు, దివానం లేకుంటే సామాన్య ప్రజల వెతలు ఎవరు తీరుస్తారంటూ నంద్యాల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోళ్ల రాజేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల పట్టణ చరిత్రలో ఎన్నడు లేని విధంగా మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురవుతున్న పట్టించుకోవడం లేదని, దాదాపు 20 కోట్లు విలువ చేసే రెండు ఎకారల స్థలాన్ని కబ్జా చేశారని ఈ విషయం రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు తెలిసి కుడా నిమ్మకు నీరెతినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు 42వార్డులలో దోమలు నివారించడానికి తీసుకొవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఇందుకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్, సున్నం తదితర వాటికి నిధులు విడుదలవుతున్నాయి కానీ సున్నం, బ్లీచింగ్ పౌడర్ ఆఫీకు చేరడం లేదని కొందరు కౌన్సిలర్లు కౌన్సిల్ దృష్టికి తెచ్చినా ఫలితం లేదని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చే బట్టలు, సబ్బులు ఇవ్వలేదని కౌన్సిల్ లో సాక్షాత్తు మాజీ చైర్మన్, కౌన్సిలర్ దేశం సులోచన తెలిపినా సాక్షాత్తు చైర్మన్ మాబున్నిసానే ఎమ్మెల్యే శిల్పా రవి, మాజీ మంత్రి మోహన్ రెడ్డి దృష్టికి తెస్తే మీకు న్యాయం జరుగుతుందని అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా సమస్యలపై స్పందించే తన లాంటి నాయకుడికి అండగా నిలవాలని రాజేష్ ప్రజలకు పిలుపునిచ్చారు.