రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జయహో బీసీ కార్యక్రమం..బీసీలంతా ఒక్కటవుదాం

tdp news, political news, jayaho bc news, ap news, cbn news
Peoples Motivation

జయహో బీసీ కార్యక్రమం..బీసీలంతా ఒక్కటవుదాం

jayaho bc meetingనంద్యాల, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):-

బీసీలంతా ఒక్కటవుదాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని వై. నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జయహో బీసీ కార్యక్రమం నంద్యాల పార్లమెంట్ లోని ఏడు మంది టిడిపి ఇన్చార్జ్ లు, ఎంపీ అభ్యర్థులు జయహో బీసీ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు నంద్యాల లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నంద్యాల జిల్లా బిసి సెల్ అధ్యక్షులు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో జయహో బీసీ,కృతజ్ఞత సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సమావేశములో నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, ఏ వి ఆర్ ప్రసాద్, బీసీ సెల్ సభ్యులు రామాంజనేయులు,కోఆర్డినేటర్ తిరుపల్ బాబు,భూషణ్, అధికార ప్రతినిధి గోవిందు నాయుడు,ప్రచార కార్యదర్శి భూషన్న, రామకృష్ణ, శ్రీరాములు, అరుణ్ కుమార్, మహానంది, బిసి సెల్ అధ్యక్ష కార్యదర్శులు ఎర్రమల నాయుడు, రామయ్య, సాధికార కన్వీనర్ వెంకటేష్, యాదవ సాధికార జిల్లా కన్వీనర్ గుర్రప్ప యాదవ్, కురువ సాధికార కన్వీనర్ శివప్రసాద్, మదాసి కురువ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటప్ప, మండల అధ్యక్షులు అరుణ్ కుమార్, ఉప్పర సాధికార జిల్లా కన్వీనర్ సురేష్, చంద్రుడు, సుబ్బారాయుడు, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

jayaho tdp

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ...

నంద్యాల పార్లమెంట్లోని ఏడు మంది టిడిపి ఇన్చార్జ్, ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.వైయస్ జగన్ చేస్తున్న దుర్మార్గాలను అక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీలపై ఆర్థిక సామాజిక భౌతిక దాడులు ఎక్కువయ్యాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి బీసీలకు దక్కవలసిన అనేక న్యాయమైన పదవులను బీసీలకు దూరం చేయడం జరిగినది. బీసీ భవనాలను కేవలం మొండి గోడలకే పరిమితం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. బీసీ విద్యార్థులకు విదేశీ విద్యను దూరం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు  ప్రజాక్షేమం కొరకై సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగినది దాంట్లో ప్రత్యేకించి బీసీ రక్షణ చట్టం, యువతకు నిరుద్యోగ భృతి,మహిళలకు గ్యాస్ సిలిండర్లు,ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి మంచి నీటి సదుపాయం,పూర్ టు రిచ్,అన్నదాత పథకం ద్వారా రైతులను ఆదుకోవడం లాంటి పథకాలను తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టింది కనుక మనమందరం ఒక్కటై తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి.నారా చంద్రబాబునాయుడు ని ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు.

Comments

-Advertisement-