రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆదర్శ ప్రెస్ క్లబ్ గా తీర్చిదిదేందుకు ప్రతి ఒక్క జర్నలిస్ట్ కృషి

press news, ts news
Peoples Motivation


ఆదర్శ ప్రెస్ క్లబ్ గా తీర్చిదిదేందుకు ప్రతి ఒక్క జర్నలిస్ట్ కృషి--పెబ్బేరు ప్రెస్ క్లబ్ కు గొప్ప చరిత్ర ఉంది 

  • ప్రెస్ క్లబ్ అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జర్నలిస్ట్ ది 
  • ప్రెస్ క్లబ్ అభివృద్ధికి టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ తమ వంతు పూర్తి సహకారం

--టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు మధు గౌడ్


వనపర్తి ఫిబ్రవరి 04 ( పీపుల్స్ మోటివేషన్ ) పెబ్బేరు ప్రెస్ క్లబ్ ను ఆదర్శ ప్రెస్ క్లబ్ గా తీర్చిదిదేందుకు ప్రతి ఒక్క జర్నలిస్టు కృషి చేయాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) వనపర్తి జిల్లా అధ్యక్షుడు మధు గౌడ్ పిలుపునిచ్చారు. పెబ్బేరు ప్రెస్ క్లబ్ కొత్త కమిటీ ఏకగ్రావంగా ఎంపిక అయినందుకు ఆదివారం పెబ్బేరు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మొదటి కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నూతన కమిటీ అధ్యక్షుడు జి. బాలవర్ధన్,ప్రధాన కార్యదర్శి పరుశరామ్, కోశాధికారి రమేష్,ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, కిరణ్ కుమార్ గౌడ్,తదితర కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మొట్టమొదట నిర్మించి ప్రారంభించిన ప్రెస్ క్లబ్ గా పెబ్బేరు ప్రెస్ క్లబ్ కు గొప్ప చరిత్ర ఉందన్నారు.దానిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జర్నలిస్ట్ పై ఉందని ఆయన సూచించారు.ప్రెస్ క్లబ్ అభివృద్ధికి టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ తమ వంతు పూర్తి సహకారం అందజేస్తుందని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి,మంత్రి జూపల్లి కృష్ణ రావు సహకారాలతోనూ ప్రెస్ క్లబ్ అభివృద్ధి చేసుకునేందుకు కమిటీ సభ్యులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు,సీనియర్ జర్నలిస్టు పౌర్ణా రెడ్డి,అరుణ్,సలీం,పెబ్బేరు ప్రెస్ క్లబ్ సభ్యులు,జర్నలిస్టులు చిరంజీవి,బాలరాజు, విజయ్ కుమార్,రాజేంద్రప్రసాద్,అతీక్,రాజేష్, నందీశ్వర్,బీసన్న,స్వామి,రంజిత్,రామకృష్ణ, మోహనాచారి,అశోక్,రవిందర్ గౌడ్,తరుణ్, జ్యోతిష్ తదితరులు పాల్గొన్నారు.

Comments
User
Comment Poster
Hi

-Advertisement-