రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నియంత పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధం-ప్రవీణ్ రెడ్డి

political news, tdp news,babu shuti bhavishyathu guarantee news,
Peoples Motivation

నియంత పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధం-ప్రవీణ్ రెడ్డి

  • Ymr కాలనీలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం
  • పెరిగిన నిత్యవసర ధరలు, కరెంట్ చార్జీలు, యువతకు ఉద్యోగాల కల్పనలో విఫలం వంటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాల పంపిణీ.....
  • వచ్చే తమ ప్రభుత్వంలో ఇచ్చే ఆరు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ.....



ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):-ప్రొద్దుటూరు పట్టణంలోని వై ఎం ఆర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నా అది కేవలం బాబు గారితోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.


ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు రూరల్ మండలాధ్యక్షుడు బోడెల బాబుల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సీతారాంరెడ్డి, తాటి శ్రీనివాసులు యాదవ్, భాగ్యమ్మ, 35వ వార్డు ఇంచార్జ్ గంగాధర్ యాదవ్, 41 వార్డు ఇంచార్జ్ షోరూం లక్ష్మీదేవి, కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆవుల దస్తగిరి, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-