నిమ్మకాయలతో కరెంట్ ఉత్పతి...
నిమ్మకాయలతో కరెంట్ ఉత్పతి...
లండన్ లోని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్త షైపుల్ ఇస్లాం 2,923 నిమ్మకాయలతో బ్యాటరీ ప్రయోగం చేసి 2,307 వోల్ట్స్ ల విద్యుత్ ను తయారు చేశాడు. దానికి గాను అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేశారు.
అతను నిమ్మకాయలకు ఒకపక్క జింక్ ప్లేట్, మరోపక్క కాపర్ ప్లేట్ ను గుచ్చి నిమ్మకాయల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ జింక్ తో కలిసి ఎలక్ట్రోడ్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎలక్ట్రోడ్స్ జింక్ ప్లేట్ లో నుంచి వెళ్లి కాపర్ ప్లేట్ తో కలిసి విద్యుత్ ని ఉత్పత్తి చేస్తాయి. ప్లస్(+), మైనస్(-) ఎలక్ట్రోడ్స ని వేరు చేసి వాటికి వైర్లను జాయింట్ చేయగా వచ్చిన విద్యుత్ తో "గో-కార్ట్ కారు బ్యాటరీ"కి ఛార్జింగ్ పెట్టాడు.
కరెంట్ తయారీ కోసం వాడిన నిమ్మ కాయలను రెన్యూవబుల్ ఎనర్జీని (Renewable Energy)(బయోగ్యాస్) ను తయారు చేసి మిగిలిన చెత్తను పంట పొలాలకు కంపోస్ట్ గా ఉపయోగించవచ్చని షైపుల్ ఇస్లాం తెలిపారు.