గంజాయి సాగు న్యాయమూర్తి సంచలన తీర్పు
గంజాయి సాగు న్యాయమూర్తి సంచలన తీర్పు..
నిందితుడికి నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష
రూ.10,000/- వేల రూపాయలు జరిమాన..
ఒకటవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి సంచలన తీర్పు
గంజాయి సాగు చేసిన అమ్మిన సేవించిన అటువంటి వారిపై కఠిన చర్యలు.. ఎస్పి ఎస్వీ మాధవ్ రెడ్డి.
శ్రీ సత్యసాయి జిల్లా/పరిగి (పీపుల్స్ మోటివేషన్ న్యూస్):-
జిల్లా టి.విజయ శేఖర్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సీఐ అన్నపూర్ణ కు వచ్చిన సమాచారం మేరకు పరిగి మండలం ఎర్రగుంట పంచాయతీ నేతల పల్లి గ్రామానికి చెందిన వై నారాయణప్ప (48) సంవత్సరాలు తన వ్యవసాయ పొలంలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడని అనుమానంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా అతను గంజాయి మొక్కలు అంతర పంటగా పెంచుతున్నట్లు గుర్తించి మడకశిర ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 2019 సెప్టెంబర్ 14వ తేదీన కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి పరిగి తాసిల్దార్ సౌభాగ్య లక్ష్మి కూడా వెళ్లి పర్యవేక్షించారు. ఈ కేసు 2019 నుంచి ఇప్పటివరకు క్రైమ్ నెంబర్ 230/2019 కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు హాజరు పరచడం జరిగింది కోర్టులో ఇప్పటివరకు కేసు జరిగి అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జి కోర్ట్ నందు అడిషనల్ పబ్లిక్ ప్రస్క్యూటర్ గోపవరం లక్ష్మీనారాయణ రెడ్డి కేసును వాదించగా ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జెస్ కోర్టు (ఎన్ డి పి ఎస్) అనంతపురం ఇంచార్జ్ ఫ్యామిలీ కోర్ట్ జడ్జి హరిత తీర్పు ఇవ్వడం జరిగింది. నిందితులకు 4 నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష 10,000/- వేల రూపాయలు జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ అన్నపూర్ణ తెలిపారు.
కఠిన చర్యలు.. ఎస్పి
గంజాయి సాగు చేసిన అమ్మిన సేవించిన అటువంటి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠినంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి హెచ్చరించారు. నిందితుడికి శిక్ష పడే విధంగా చేసిన అధికారులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.