రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మసిపూసి మారేడు కాయ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...

What are the education schemes in AP? What is the education status of Andhra Pradesh?What is EdX online courses?Abvp questioning on Edx school program
Peoples Motivation

మసిపూసి మారేడు కాయ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...

ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీకి యూనివర్సిటి లతో ఏమి సంబంధం..

రాష్ట్ర ప్రభుత్వం edX సంస్థ యొక్క ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి..

- ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎర్రి స్వామి 

 కర్నూలు, ఫిబ్రవరి 20 (పీపుల్స్ మోటివేషన్):-

ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కర్నూలు నగర శాఖ ఆధ్వర్యంలోABVP కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎర్రి స్వామి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఎడెక్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అయితే దీనివల్ల ప్రయోజనాలు దేవుడెరుగు కానీ నష్టాలు కూడా ఉన్నాయి అని విద్యార్థి పరిషత్ భావిస్తుంది. విద్యార్థులకు నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విద్యార్థి పరిషత్ ఎప్పుడు వ్యతిరేకం కాదని, ఇటువంటి నూతన ప్రణాళికలు ఎటువంటి అవకతవక్కలు లేకుండా పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యేవిధంగా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, గతంలో బై జ్యూస్ లాంటి సంస్థలతో చేసిన ఒప్పందాలు దానివల్ల జరిగిన నష్టాలను కూడా పరిగణంలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఏబీవీపీ తెలియజేస్తుంది. ఇప్పుడు చేసుకున్న ఒప్పందంలో ముఖ్యంగా పరీక్షలకు సంబంధించి విద్యార్థి నేర్చుకున్న తర్వాత దానిని ఏ విధంగా మూల్యాంకనం చేస్తారు, సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు. అనేటువంటి విషయాలపై సరైన అవగాహన కల్పించాల్సి ఉంది. పైగా విద్యాసంవత్సరం ముగింపు దశలో దీనిని తీసుకు రావడం లో ఆంతర్యం ఏమిటి......? ఇటువంటి సంస్థలను ఈరోజు రాష్ట్రంలో తీసుకువచ్చి నాణ్యమైనటువంటి విద్యను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమౌతుంది. అని నిరూపించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందని ఏబీవీపీ భావిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 80% అధ్యాపకుల పోస్ట్లు ఖాళీలతో దారుణ స్థితిలో విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రత్యేక నిధులను కేటాయించకుండా విద్యారంగాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది. కేవలం సమస్యల ద్వారా కాకుండా ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి సదుపాయాలు కల్పించడంతో పాటు నాణ్యమైనటువంటి ప్రయోగాలు చేయడం వల్లనే విద్యార్థికి ఎక్కువ లాభం చేకూరుతుంది. ఈ యొక్క పోస్టులను ఫిల్ అప్ చేయకపోవడం వల్ల ఈ రోజు edX తో ఒప్పందము లేదంటే ఇంకొక విద్య సంస్థతో ఒప్పందం చేసుకొని విద్యను ప్రైవేటీకరణ వైపుకు వెళుతున్నది, ఈ రాష్ట్రప్రభుత్వం. అలాగే పాలిటెక్నిక్ , డిగ్రీ కళాశాలల్లో యూనివర్సిటీలోనూ నైపుణ్యం ఉన్నటువంటి అధ్యాపకులను భర్తీ చేయడం ద్వారా నాణ్యమైనటువంటి విద్యను అందించగలుగుతాము అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయింది. ఈ నాణ్యమైనటువంటి విద్యను మనము ఎప్పుడైతే అందించలేకుండా పోతామో ఈ రకమైనటువంటి సంస్థల పట్ల మనం ఎక్కువ ఆధార పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనకు స్వభావిక సంస్థలైనటువంటి NPTL, SWAYAM వంటివి విద్యార్థులు ఎక్కువ శాతం మనం ఉపయోగంలోకి తీసుకుని రాలేకపోతున్నాము, ఇవి తీసుకొని రాలేకపోవడంతో పాటు కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి edX లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు దాపరించాయి. వీటి యొక్క విధివిధానాల్లో ప్రతి విద్యార్థికి మరియు ప్రతి టీచర్కు అర్థమయ్యేటట్లు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది, ఎప్పుడు ఈ కోర్సు స్టార్ట్ చేస్తారు, ఈ కోర్సు ఎన్ని రోజులు చదవాలి, దీని యొక్క టీచింగ్ విధానాలలో డౌట్స్ వస్తే ఏ విధంగా వీటిని తీర్చుకోవాలినీ, ఒక నిర్దిష్టమైనటువంటి విషయాలను విద్యార్థులకు అవగతమైనట్లు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఒప్పందం ప్రపంచ ఉన్నతమైన యునివర్సిటీలతో అని రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్నది. కానీ edX అనే సంస్థ ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ దీనికి యూనివర్సిటి లతో ఏమి సంబంధం.....? ఇదంతా మసిపూసి మారేడు కాయ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అనేది తేట తెల్లం అవుతున్నది. కావున ప్రతి ఒక్కరికి ఈ ఒప్పందం పూర్తి విధి విధానాలు బహిర్గత పరిచిన తర్వాతే అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ ఈ సందర్భంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని యెడల ABVP రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా టెక్నికల్ సెల్ కన్వీనర్ లోకేష్, జిల్లా టెక్నికల్ సెల్ కో కన్వీనర్ రూపేష్, ఆకాష్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

Abvp image

Comments

-Advertisement-