కర్నూలు ఈనాడు కార్యాలయం పై దాడి అప్రజాస్వామికం
కర్నూలు ఈనాడు కార్యాలయం పై దాడి అప్రజాస్వామికం
దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సిపిఎం బృందం
కర్నూలు, ఫిబ్రవరి 20 (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక రౌడీల రాజ్యం పరిడవిల్లుతోందా అనేది అర్థం కాకుండా పోతోందని సిపిఎం నాయకులు విమర్శించారు. గురువారం సాయంత్రం ఈనాడు కార్యాలయం పై జరిగిన దాడి అరాచకత్వాన్ని తలపిస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ రాధాకృష్ణ, జిల్లా నాయకులు ఎం రాజశేఖర్, ఎండి ఆనంద్ బాబు, నగర నాయకులు కే రామకృష్ణ, ఎన్ జి కృష్ణ విమర్శించారు. దాడికి గురైన ఈనాడు కార్యాలయ పరిసర ప్రాంతాలను సిపిఎం బృందం పరిశీలించి మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని ప్రజాస్వామ్య యుతంగా ఆందోళన చేయవచ్చు కానీ, అనుచర గుంపుతో దాడి చేయడం అనేది పాసవిక చర్య అని వారు విమర్శించారు.
వార్త సరైనది కానీ ఎడల, పరువు నష్టం పేరుతో కోర్టుకు వెళ్ళవచ్చునని, దాడి చేయడం అనేది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమేనన్నారు. లేని రాజకీయాన్ని పత్రికా విలేకరులపై పులిమి భౌతిక దాడులకు తెగబడడం సరైంది కాదన్నారు. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని, దాడులకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలకు సంపూర్ణ సంఘీభావాన్ని వారు ప్రకటించారు.